Asia Cup Final : ఆసియా కప్ ఫైనల్‌కు మరికొన్ని నిమిషాల్లో తెరలేవనుంది. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైటిల్ పోరులో భారత్, పాకిస్థాన్ జట్లు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో తలపడుతున్నాయి. ఈ మెగా టోర్నీలో దాయాదులు తొలిసారి ఎదురుపడుతున్న ఫైనల్ ఇది. దాంతో.. విజయం ఎవరిని వరిస్తుంది? అని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
బిగ్ ఫైట్‌గా అభివర్ణిస్తున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత సారథి బౌలింగ్ తీసుకున్నాడు. ఆల్‌రౌండర్ హర్దిక్ పాండ్యా కోలుకోకపోవడంతో రింకూ సింగ్ తుది జట్టులోకి వచ్చాడు. పాక్ మాత్రం ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతుందని సల్మాన్ అఘా వెల్లడించాడు.
THREE CHANGES for India, none for Pakistan 🏏
Hardik Pandya, Harshit Rana and Arshdeep Singh are replaced by Rinku Singh, Shivam Dube and Jasprit Bumrah 🔁 pic.twitter.com/hFDgy2ejFB
— ESPNcricinfo (@ESPNcricinfo) September 28, 2025
భారత్ తుది జట్టు : అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), శివం దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
పాక్ తుది జట్టు : సయీం ఆయూబ్, షహిబ్జద ఫర్హాం, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), హుస్సేన్ తలాట్, మొహమ్మద్ హ్యారిస్ (వికెట్ కీపర్), మొహమ్మద్ నవాజ్, ఫహీం అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హ్యారిస్ రవుఫ్, అబ్రార్ అహ్మద్.
ఆసియా కప్‌లో అజేయంగా దూసుకెళ్తున్న భారత్ ఫైనల్లోనూ విజయఢంకా మోగించాలని భావిస్తోంది. ఇదివరకూ లీగ్ దశతో పాటు సూపర్-4లోనూ పాక్‌ను మట్టికరిపించిన టీమిండియా.. టైటిల్ పోరులోనూ తడాఖా చూపించాలనుకుంటోంది. బ్యాటింగ్ యూనిట్‌కు అభిషేక్ శర్మ కొండంత ఆస్తిలా మారగా.. మిడిలార్డర్లో సంజూ శాంసన్, తిలక్ వర్మ, దూబే, రింకూలు కీలకం కానున్నారు. బౌలింగ్ విషయానికొస్తే కుల్దీప్, వరుణ్ రాణిస్తున్నా బుమ్రా చెలరేగాల్సి ఉంది.
India will not have Hardik Pandya in the final!
Asia Cup LIVE ➡️ https://t.co/6yhNKeDomw pic.twitter.com/HCdRsZNLcw
— ESPNcricinfo (@ESPNcricinfo) September 28, 2025
అయితే.. బంగ్లాదేశ్, శ్రీలంకపై ఫీల్డింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. సులువైన క్యాచ్‌లు సైతం జారవిడువడం.. బౌండరీ వద్ద చురుకుగా కదలకపోవడం వంటివి టీమిండియా క్రికెటర్లు సరిచూసుకోవాల్సి ఉంది. ఫార్మాట్ ఏదైనా సరే పాక్‌పై పైచేయి భారత్‌దే అయినప్పటికీ.. ఫైనల్లోనూ ఓడించి కప్‌ను అందుకుంటే అంతకుమించిన సంతోషం ఉండదని కోరుకుంటున్నారు అభిమానులు.