మహబూబ్‌నగర్ అర్బన్: ఒకప్పుడు తాగునీటి కోసం అవస్థలు పడిన మహబూబ్‌నగర్.. నేడు విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నదని క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ సహకారంతో పాలమూరును అద్భుతంగా తీర్చిదిద్దడం వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు.
ఫ్రెంచ్ మోటర్ సైక్లిస్ట్ ఆలిసన్ గ్రున్ ఆధ్వర్యంలోని ఫ్రీ డబ్ల్యూ వేదిక ద్వారా ఫ్రాన్స్, అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, సింగపూర్, థాయ్‌లాండ్‌కు చెందిన 8 మంది విదేశీ బైక్‌రైడర్లు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే యాత్రను జిల్లా కేంద్రంలో శనివారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. అనంతరం వారితో పాటు బైక్ రైడింగ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘రైడర్లు అలిసన్ గ్రున్, సడ్రైన్, ఆస్లీ, జనెల్లి, జువేనా, స్టాసి, లారీ, సిగ్రిడ్, రచన బైక్ రైడింగ్ ద్వారా మహబూబ్‌నగర్, వికారాబాద్, నిర్మల్, వరంగల్, పోచంపల్లి మీదుగా హైదరాబాద్ చేరుకుంటారు’అని తెలిపారు. 9 రోజుల పాటు పర్యాటక ప్రదేశాలు సందర్శించనున్నారు.
ఒకప్పుడు తాగునీటికి అవస్థలు పడిన మహబూబ్ నగర్… నేడు విదేశీ పర్యాటకులను సైతం విశేషంగా ఆకర్షిస్తుంది. సమానత్వానికి సాక్షిగా ఫ్రెంచ్ మోటార్ సైక్లిస్ట్ అలిసన్ గ్రున్ ఆధ్వర్యంలోని ఫ్రీ డబ్ల్యూ (Free W) అనే వేదిక ద్వారా తెలంగాణలో… ఫ్రాన్స్, అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా, సింగపూర్… pic.twitter.com/iI5t4OMyEA
— V Srinivas Goud (@VSrinivasGoud) October 14, 2023