దుబాయ్: ఆసియాకప్‌లో గత ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ క్రికెటర్లు హరీస్ రౌఫ్, ఫర్హన్ చేసిన సంకేతాలు వివాదం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి విచారణ చేపట్టి ఆ ఇద్దర్నీ మందలించింది. ఇక బౌలర్ రౌఫ్‌కు మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించింది. అయితే రౌఫ్‌కు విధించిన ఫీజును పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మెన్(PCB Chairman) మోషిన్ నఖ్వీ వ్యక్తిగతం చెల్లించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన సమా టీవీ ఈ అంశంపై కథనం ప్రసారం చేసింది.
సూపర్-4 మ్యాచ్‌లో అభ్యంతరకర హావభావాలతో టీమ్ఇండియా అభిమానులను రెచ్చగొట్టేవిధంగా ప్రవర్తించిన పాకిస్థాన్ క్రికెటర్లు హరీస్ రౌఫ్, ఫర్హాన్‌పై ఐసీసీ చర్యలకు దిగింది. రౌఫ్ మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించగా ఫర్హాన్‌ను మందలించి మళ్లీ ఇలాంటివి చేయరాదని వార్నింగ్ ఇచ్చింది. బీసీసీఐ ఫిర్యాదు మేరకు శుక్రవారం ఐసీసీ మ్యాచ్ రిఫరీ రిచి రిచర్డ్సన్ ఎదుట విచారణకు హాజరైన రౌఫ్.. మ్యా చ్లో తాను చేసిన సంజ్ఞ (ఆపరేషన్ సిం ధూర్లో పాక్ సైన్యం భారత్‌కు చెందిన ఆరు ఫైటర్ జెట్లను కూల్చిందనేదానిని ప్రతిబింబించేలా చేతి వేళ్లతో ఆరు అని చూపించడం)లు భారత్‌ను ఉద్దేశించినవికావని విచారణలో చెప్పినట్టు తెలిసింది. గన్ ఫైరింగ్ సంకేతం చేసిన ఫర్హన్కు వార్నింగ్ ఇచ్చారు.