Waqar Younis : పాకిస్థాన్ లెజెండరీ బౌలర్ వకార్ యూనిస్(Waqar Younis)కు కీలక పదవి దక్కింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) చీఫ్‌కు సలహాదారుగా వకార్ నియమితులయ్యాడు. ఇకపై పీసీబీకి సంబంధించిన అన్ని క్రికెట్ వ్యవహారాలను ఈ మాజీ స్పీడ్‌స్టర్ చూసుకోనున్నాడు. పీసీబీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ(Mohsin Naqvi)కి అడ్వైజర్‌గా ఆగస్టు 1 వ తేదీన వకార్ బాధ్యతలు చేపట్టనున్నాడు.
సరిగ్గా అదే నెలలో పాకిస్థాన్ జట్టు స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది. అనంతరం ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్ జట్లతో తలపడనుంది. సుదీర్ఘ అంతర్జాతీయ అనుభవం ఉన్న ఈ మాజీ సారథి పాకిస్థాన్ జట్టును గాడీలో పెడుతాడా? లేదా? చూడాలి.
PCB Chairman Mohsin Naqvi has appointed former captain Waqar Younis to oversee cricket affairs. Waqar Younis will now handle matters related to international and domestic cricket, the selection committee, coaching staff, and player NOCs. pic.twitter.com/J0LroJNXvK
— Cricket Pakistan (@crickethub_pk) July 30, 2024
రెండేండ్ల క్రితం పొట్టి ప్రపంచ కప్ రన్నరప్‌గా నిలిచిన పాకిస్థాన్ ఆ తర్వాత ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోయింది. అనిశ్చితికి తమ టీమ్ కేరాఫ్ అని మరోసారి నిరూపించుకుంది. నిరుడు ఆసియా కప్ (Asia Cup 2023)తో మొదలు పాకిస్థాన్ జట్టు చెత్ ఆటతో నిరాశపరుస్తోంది. భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే వరల్డ్ కప్‌లో తేలిపోయిన పాక్.. ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్‌లో గ్రూప్ దశలోనే ఇంటికి వెళ్లింది. దాంతో, స్వదేశంలో బాబర్ ఆజాం బృందంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వకార్ పీసీబీ చీఫ్ సలహాదారుగా ఎంపికవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత ఏడాది కాలంగా నిలకడ లేమితో అభాసు పాలవుతున్న పాకిస్థాన్ జట్టును గెలుపు తోవ తొక్కించడమే లక్ష్యంగా వకార్ పని చేయనున్నాడు. పాక్ మాజీ కెప్టెన్, ప్రధాన కోచ్ అయిన వకార్ దేశం తరఫున 87 టెస్టులు, 262 వన్డేలు ఆడాడు.