Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయని భారత ఆర్చర్ దీపికా కుమారి (Deepika Kumari) వ్యక్తిగత విభాగంలో రాణించింది. మహిళల కేటగిరీలో 16వ రౌండ్‌కు అర్హత సాధించింది. బుధవారం జరిగిన పోటీల్లో రీనా పర్నాట్(ఎస్తోనియా), క్వింటీ రోఫెన్(నెదర్లాండ్స్)లను ఓడించిన దీపిక ముందంజ వేసింది.
64వ స్టేజ్ రౌండ్లో పర్నాట్ను 6-5తో పైచేయి సాధించిన భారత ఆర్చర్.. 32వ రౌండ్లో రోఫెన్పై 6-2తో విజయం సాధించింది. క్వార్టర్స్ బెర్తును నిర్ణయించే తర్వాతి పోరులో దీపిక జర్మనీ ఆర్చర్ మిచెల్లె క్రొప్పెన్ (Mitchelle Kroppen)తో తలపడనుంది. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానంలో ఉన్న మిచెల్లెకు దీపిక చెక్ పెడితే పతక వేటలో ముందుకెళ్తుంది.
DEEPIKA KUMARI INTO ROUND OF 16…!!! 👌
– She continues her dream run today by winning both games. 🔥 pic.twitter.com/7Os3o1GYpn
— Johns. (@CricCrazyJohns) July 31, 2024
మరోవైపు యువ ఆర్చర్ భజన్ కౌర్ (Bhajan Kaur) వ్యక్తిగత విభాగంలో సత్తా చాటుతోంది. ఇప్పటికే 16వ రౌండ్‌కు అర్హత సాధించిన కౌర్.. 1జ8 ఫైనల్స్ రౌండ్లో ఇండోనేషియా ఆర్చర్ దయానంద చైరునిసాతో తాడోపేడో తేల్చుకోనుంది.