Caste Issue : లోక్‌సభలో కాషాయ నేతలు కులాల ప్రస్తావన తీసుకురావడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే విస్మయం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ కులంపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన క్రమంలో ఈ వ్యవహారంపై ఖర్గే స్పందించారు. పార్లమెంట్లో కులాల ప్రస్తావన సరైంది కాదని, రాహుల్ గాంధీని అవమానించేందుకే అనురాగ్ ఠాకూర్ మాట్లాడారని, ఇది సరైంది కాదని చెప్పారు.
ఎంతోమంది సీనియర్ బీజేపీ నేతలు కులాంతర వివాహాలు చేసుకున్నారని, ఈ విషయం వారు గుర్తెరగాలని అన్నారు. ముందు మీరు అద్దంలో చూసుకుని ఇతరుల గురించి మాట్లాడాలని కాషాయ నేతలకు ఖర్గే హితవు పలికారు. అనురాగ్ ఠాకూర్ అపరిపక్వతతో మాట్లాడితే దాన్ని ప్రధాని మోదీ ట్వీట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
పలువురు బీజేపీ నేతలు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్నారు..వారు ప్రతిఒక్కరి కులం గురించి అడుగుతారా..? ఇది తప్పని, దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఖర్గే పేర్కొన్నారు. ప్రధాని మోదీ ట్వీట్‌ను కూడా తాను ఖండిస్తున్నానని చెప్పారు. ఎక్కడ మాట్లాడాలి, దేన్ని సమర్ధించాలనేది ప్రధాని మోదీ తెలుసుకోవాలని హితవు పలికారు. ఈ విషయం పక్కనపెట్టి సెంటిమెంట్లను రగిలించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్లో దీన్ని అనుమతించరాదని ఖర్గే స్పష్టం చేశారు.
Read More :
Condom | కండోమ్‌తో జాగ్రత్త.. వంధ్యత్వం, క్యాన్సర్ రావొచ్చు..!