Arjun Rampal | బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్ (Pyaar Ishq Aur Mohabbat) అనే సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే డెబ్యూ హీరోగా ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ తర్వాత డాన్, ఓం శాంతి ఓం, రావణ్, రాక్ ఆన్ చిత్రాలతో సూపర్ హిట్లు అందుకున్నాడు. ఈ నటుడు 2019లో తన వైవహిక జీవితానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. ఇండియన్ మాడల్, నిర్మాత మెహర్ జెసియాను 1998లో పెళ్లి చేసుకున్న అతడు అనుకోని కారణాల వలన 2019న విడిపోయారు. వీరికి నలుగురు పిల్లలు. అయితే ప్రస్తుతం గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్ అనే అమ్మాయితో డేటింగ్లో ఉన్న ఈ నటుడు పెళ్లి ఎప్పుడు అని అడుగగా తన సినీ కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
అర్జున్ మాట్లాడుతూ.. మెహర్ జెసియాను 24 ఏళ్లకే పెళ్లి చేసుకున్న. నాకు తెలిసి చాలా చిన్న వయసులోనే నా పెళ్లి జరిగిపోయింది. పెళ్లి కంటే ముందు మనం చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో అమ్మాయిలు చాలా బెటర్ వాళ్లు తొందరగా పరిణితి చెందుతారు. కానీ అబ్బాయిలు అలా కాదు ఎదవలు ఒక ఇన్సిడెంట్ అయితే కానీ అనుభవం రాదు. అందుకే కొంచెం వయసు వచ్చాక పెళ్లి చేసుకొండి అంటూ తెలిపాడు.
అబ్బాయిలు వాళ్ల చిన్ననాటి ఫ్రెండ్స్‌ను పెళ్లి చేసుకున్నప్పుడు అవి బాగుంటాయని నమ్మడం అనేది మిరాకిల్స్ మాత్రమే. నేను మెహర్ నుంచి విడాకులు తీసుకున్నప్పుడు చాలా కష్టంగా గడిచింది. అవి మా పిల్లలను ఎంతో బాధించాయి. ఆ సమయంలో వారు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నారు. పెళ్లి తర్వాత చాలా తప్పులు జరిగాయి. వాటికి పూర్తిగా నేనే బాధ్యత వహిస్తున్నాను. డివోర్స్ తర్వాత మెహర్‌తో ఇప్పటికి మంచి రిలేషన్ ఉందని దాన్ని మాత్రం దూరం చేసుకోనని వెల్లడించాడు.
ఇక తన ప్రియురాలు గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్ గురించి ఇంటర్వ్యూలో అడుగగా.. గాబ్రియెల్లా నాకు మంచి ఫ్రెండ్. నేను ఒంటరిగా ఉన్న సమయంలో దేవుడు పంపినట్లు నా జీవితంలోకి వచ్చింది. నాతో ఉన్నట్లే నా పిల్లలను కూడా అంతే ప్రేమిస్తుంది. ఇక మా పెళ్లి విషయానికి వస్తే మా మనసులు ఎప్పుడో కలిశాయి. అదే పెళ్లి అనుకుంటున్నా అంటూ రాంపాల్ చెప్పుకోచ్చాడు. బాలకృష్ణ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ భగవంత్ కేసరి సినిమాలో విలన్ పాత్రలో మెరిశాడు ఈ నటుడు.
Also Read..
Manushi Chhillar | మాజీ సీఎం మనవడితో బాలీవుడ్ నటి డేటింగ్.?
Devara Movie | ఏంటి ‘దేవర’ ఇది నిజమేనా.. మీ సినిమా రిలీజ్ 2031లోనా?