Devara Movie | ఆర్ఆర్ఆర్ తరువాత టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ నటించిన ఏ చిత్రం ఇప్పటి వరకు విడుదల కాలేదు. ప్రస్తుతం ఈ నందమూరి వారసుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జాహ్నవి కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఆమెకు తెలుగులో ఇదే తొలిచిత్రం. అక్టోబర్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అయితే ఇది కేవలం దేవర పార్ట్-1 మాత్రమే. పార్ట్-2 విషయాలు ప్రకటించలేదు మేకర్స్… ఇదిలా వుండగా ఎన్టీఆర్ భవిష్యత్ సినిమాలు అనగా 2031 వరకు ఆయన సినిమాల ప్లానింగ్ రెడీగా వుందట. ఇందులో ఓ సినిమా ప్లానింగ్ చూస్తే ఎవరికైనా షాకింగ్‌గా వుండాల్సిందే. ఎందుకంటే తదుపరి సినిమా ప్లానింగ్‌నే సరిగ్గా చెప్పలేని ఈ రోజుల్లో ఎన్టీఆర్ ఓ ప్రాజెక్ట విషయాలు చూస్తే.. అందరూ ఏమీ ప్లానింగ్… ఏమీ ప్లానింగ్ అనక మానరు.
వివరాల్లోకి వెళితే నానితో తెరకెక్కించిన హాయ్ నాన్న సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చూపిన శౌర్యు దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమాలో నటిండానికి అంగీకరించాడట. 2026లో షూటింగ్ మొదలయ్యే ఈ సినిమా రెండు పార్ట్‌లుగా చిత్రీకరించబోతున్నారని తెలిసింది. ఇందులో మొదటి పార్ట్‌ను 2028లో విడుదల చేసి 2031లో రెండో పార్ట్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అయితే ఈ లోపు ఎన్టీఆర్ దేవర పార్ట్ 2తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా చేయ్యబోతున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత శౌర్యు సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం వుంది. అయితే ఇది ప్రస్తుతానికి ఎన్టీఆర్ 2031 వరకు సినిమాల షెడ్యూల్. అయితే ఇందులో ఏ మాత్రం షూటింగ్ డిలే జరిగినా ఈ షెడ్యూల్ 2032 వరు జరిగే అవకాశం వుంది. అయితే ఈలోపు ఎన్నో పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి అంటున్నారు సినీ జనాలు.
Also Read..
They Call Him OG | ఏంటీ పవన్ కల్యాణ్ మేకప్ వేసుకునే టైం వచ్చేసిందా..? ఓజీ షూట్‌పై క్రేజీ న్యూస్