Vadodara ODI : భారత్‌లో టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడడంపై అనిశ్చితి కొనసాగుతోంది. భద్రతా కారణాల రీత్యా తమ జట్టును ఇండియాకు పంపబోమని ఆ దేశ బోర్డు ఐసీసీకి ఈ-మెయిల్ పంపడమే అందుకు కారణం. అయితే.. భారత్‌లో భద్రతకు ఢోకా లేదని చాటుతూ బంగ్లాదేశ్‌కు చెందిన అంపైర్ వడోదర వన్డే (Vadodara ODI )లో విధులు నిర్వహిస్తున్నాడు. దాంతో.. ఈ విషయంపై బంగ్లాదేశ్ బోర్డు అంపైర్ల విభాగం ఛైర్మన్ స్పందిస్తూ అతడు కాంట్రాక్ట్ అంపైర్ అని చెప్పాడు.
బీసీసీఐ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మధ్య దూరం పెరిగిన వేళ భద్రతా కారణాలు సాకుగా చూపి తమ జట్టును పంపించొద్దని బంగ్లా బోర్డు నిర్ణయించుకుంది. అయితే.. ఈ విషయం ఐసీసీ చూసుకుంటుందని భావించిన బీసీసీఐ మౌనంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో భారత్, న్యూజిలాండ్ మధ్య వడోదరలో జరుగుతున్న తొలి వన్డేకు బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫుద్దౌల ఇబ్నే షాహిద్ సైకాత్ (Sharfuddoula Ibne Shahid Saikat) టీవీ అంపైర్‌గా ఎంపికయ్యాడు. అతడు ఇండియాలో విధులు నిర్వర్తించడంపై బంగ్లా బోర్డు అంపైర్ల విభాగం ఛైర్మన్ ఇఫ్తికార్ రహమాన్ క్రిక్‌బజ్‌తో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
In case you missed it, The 3rd Umpire in the ongoing first ODI match between India and New Zealand is Sharfuddoula Saikat.
He is from Bangladesh.
Where is boycott gang now & shame on you @BCCI to allow him to officiate in India#INDvsNZ pic.twitter.com/XfJPVadNAu
— Meme Point (@MemePoiint) January 11, 2026
‘షరీఫుద్దౌల ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో కాంట్రాక్ట్ అంపైర్. అతడికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అవసరం లేదు. మరో విషయం.. అతడితో బంగ్లా బోర్డు ఒప్పందం కుదుర్చుకోలేదు. మా కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం మా దేశానికి చెందిన అంపైర్లు ఎవరూనా ఐసీసీ కోరిక మేరకు ఎవరైనా అంపైరింగ్ చేయవచ్చు’ అని ఇఫ్తికార్ వెల్లడించాడు. షరీఫుద్దౌలాతో పాటు బంగ్లాకే చెందిన గాజీ సోహెల్ సైతం ఫిబ్రవరిలో మొదలయ్యే టీ20 ప్రపంచకప్‌లో అపైరింగ్ చేస్తారని సమాచారం.