Lost Dog Returns Home | తప్పిపోయిన కుక్క.. 250 కిలోమీటర్లు ప్రయాణించి యజమాని ఇంటికి చేరింది
Lost Dog Returns Home | యాజమానితో కలిసి తీర్థయాత్రకు వెళ్లిన ఒక పెంపుడు కుక్క అక్కడ తప్పిపోయింది. అయితే 250 కిలోమీటర్లు ప్రయాణించి తిరిగి యజమాని ఇంటికి చేరింది. దీంతో సంతోషం పట్టలేని ఆ కుక్క యాజమాని దాని రాకను గ్రాండ్గా సెలబ్రేట్ చేశాడు.
బెంగళూరు: యాజమానితో కలిసి తీర్థయాత్రకు వెళ్లిన ఒక పెంపుడు కుక్క అక్కడ తప్పిపోయింది. అయితే 250 కిలోమీటర్లు ప్రయాణించి తిరిగి యజమాని ఇంటికి చేరింది. (Lost Dog Returns Home) దీంతో సంతోషం పట్టలేని ఆ కుక్క యాజమాని దాని రాకను గ్రాండ్గా సెలబ్రేట్ చేశాడు. ఆ కుక్క మెడలో దండ వేసి స్వాగతం పలకడంతోపాటు గ్రామస్తులకు విందు ఇచ్చాడు. కర్ణాటకలోని బెలగావి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. యమగర్ని గ్రామానికి చెందిన కమలేష్ కుంభార్ ఇంట్లో ‘మహారాజ్’ అనే పెంపుడు కుక్క ఉంది. ప్రతి ఏటా ఆయన భక్తులతో కలిసి దక్షిణ మహారాష్ట్రలోని పంఢర్పూర్కు కాలినడకన తీర్థయాత్రగా వెళ్తుంటాడు. ఈసారి పెంపుడు కుక్క కూడా అతడ్ని అనుసరించింది.
కాగా, జూన్లో సుమారు 250 కిలోమీటర్లు నడిచిన కుమలేష్ బృందం మహారాష్ట్రలోని విఠోబా ఆలయానికి చేరుకుంది. అయితే పాండురంగ స్వామి దర్శనం తర్వాత పెంపుడు కుక్క ‘మహారాజ్’ తప్పిపోయింది. దీంతో కమలేష్ ఆందోళన చెందాడు. తన కుక్క కోసం అక్కడంతా వెతికాడు. మరో గుంపుతో కలిసి అది వెళ్లినట్లు కొందరు వ్యక్తులు చెప్పారు. దీంతో జూన్ 14న కమలేష్ తన ఇంటికి చేరుకున్నాడు.
మరోవైపు ఆ మరునాడు పెంపుడు కుక్క తన యజమాని ఇంటికి చేరుకుంది. తోక ఊపుతూ ఇంటి ముందున్న ‘మహారాజ్’ను చూసి కమలేష్ కుంభార్ ఆనందం పట్టలేకపోయాడు. ఒంటరిగా 250 కిలోమీటర్లు ప్రయాణించి మహారాష్ట్ర నుంచి కర్ణాటకలోని తన గ్రామానికి అది చేరుకోవడం చూసి ఆశ్చర్యపోయాడు. పాండురంగ నాథుడే ఆ కుక్కకు దారి చూపి తన ఇంటికి చేర్చినట్లు భావించాడు. ‘మహారాజ్’ మెడలో పూల దండ వేసి హారతి ఇచ్చి తన ఇంట్లోకి స్వాగతం పలికాడు. అంతేగాక గ్రామస్తులకు విందు కూడా ఇచ్చాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

