WI vs ENG : స్వదేశంలో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఎట్టకేలకు వెస్టిండీస్(West Indies) గెలుపొందింది. వరుసగా మూడు మ్యాచుల్లో చిత్తుగా ఓడి సిరీస్ పోగొట్టున్న విండీస్ జట్టు శనివారం ఓదార్పు విజయంతో పరువు కాపాడుకుంది. సెయింట్ లూసియాలో ఇంగ్లండ్ (England) నిర్ధేశించిన 219 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్లు ఎవిన్ లెవిస్(68), షాయ్ హోప్(54)లు అర్ధ శతకాలతో మెరిశారు. దాంతో మరో ఓవర్ ఉండగానే కరీబియన్ జట్టు మ్యాచ్‌ను ముగించింది.
వన్డే సిరీస్‌లో దుమ్మురేపిన వెస్టిండీస్ తమకు అచ్చొచ్చిన పొట్టి ఫార్మాట్లో మాత్రం తడబడింది. వరుసగా మూడు మ్యాచుల్లో పరాజయంతో ఇంగ్లండ్‌కు సిరీస్ సమర్పించుకుంది. ఇక నాలుగో మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ 218 పరుగులు కొట్టగా.. ఇక కరీబియన్ల పని అయిపోయినట్టే అనిపించింది.
219 hunted down with an over to spare 🤯
West Indies clinch their first win of the T20I series with their highest successful chase on home soil!https://t.co/4F4JJuZ24G | #WIvENG pic.twitter.com/Y9eIZfjFeD
— ESPNcricinfo (@ESPNcricinfo) November 16, 2024
కానీ, గత మ్యాచుల్లో విఫలమైన ఓపెనర్లు ఎవిన్ లెవిస్(68), షాయ్ హోప్(54)లు 9.1 ఓవర్లలోనే 136 పరుగులు జోడించి గట్టి పునాది వేశారు. ఆ తర్వాత ఇంగ్లండ్ పట్టుబిగించినా కెప్టెన్ రొవ్మన్ పావెల్(38), ఆల్‌రౌండర్ షెర్ఫానే రూథర్‌ఫొర్డ్(29 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఐదు వికెట్ల తేడాతో గెలుపొందిన విండీస్ సిరీస్‌లో బోణీ కొట్టింది.
హ్యాట్రిక్ విక్టరీలతో పొట్టి సిరీస్ గెలుపొందిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. ఫిల్ సాల్ట్(55), విల్ జాక్స్(25)లు విండీస్ బౌలర్లను దంచేస్తూ 50 ప్లస్ భాగస్వామ్యం నిర్మించారు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ జోస్ బట్లర్(38), జాకబ్ బెథెల్(62)లు ధనాధన్ ఆడడంతో ఇంగ్లండ్ స్కోర్ పరుగులు పెట్టింది. ఆఖర్లో సామ్ కరన్(24 నాటౌట్) రెండు సిక్సర్లు బాదగా పర్యాటక జట్టు 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో గుడకేశ్ మోతీ మాత్రమే రెండు వికెట్లతో రాణించాడు.