అమరావతి : విశాఖలోని వాల్తేరు డివిజనల్ రైల్వే అధికారి (Waltheru DRM ) సౌరభ్ ప్రసాద్ లంచం తీసుకుంటూ సీబీఐకి (CBI) చిక్కారు. మెకానికల్ బ్రాంచ్ పనుల టెండర్ వ్యవహారంలో ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 25 లక్షల లంచం డిమాండ్ చేయగా సదరు కాంట్రాక్టర్(Contractor) ముంబాయికి రమ్మని పిలిచారు.
నిన్న ముంబాయి వెళ్లిన డీఆర్ఎం కాంట్రాక్టర్ నుంచి రూ. 10 లక్షలు తీసుకొని ముంబాయిలోని ఇంటికి వెళ్లగా అప్పటికే సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు మాటు వేసి ఇంటి వద్ద నగదుతో పట్టుకున్నారు. బాధితుడు ఫిర్యాదుతో ముందస్తుగా ముంబాయి, విశాఖలోని డీఆర్ఎం ఇంట్లో సోదాలు నిర్వహించారు. సీబీఐ అధికారులు డీఆర్ఎం సౌరబ్ కుమార్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.