Game Changer | గ్లోబల్ స్టార్ రాంచరణ్ (Ram Charan) నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ గేమ్‌ఛేంజర్ (Game Changer). శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ, రాజోలు భామ అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ మూవీ 2025 జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన టీజర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
తాజాగా ఫైనల్ షూట్ అప్డేట్ బయటకు వచ్చింది. గేమ్ ఛేంజర్ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్ చివరి షెడ్యూల్ హైదరాబాద్‌లో రేపు షురూ కానుంది. సపోర్టింగ్ రోల్స్‌లో నటిస్తోన్న యాక్టర్లు ఈ షెడ్యూల్లో పాల్గొననున్నారట. ఈ షెడ్యూల్‌తో త్వరలోనే షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే కొనసాగుతున్నాయని ఇన్సైడ్ టాక్.
గేమ్ ఛేంజర్‌లో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్టర్లు ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రల్లో నటిషిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నాడు. ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
The Rana Daggubati Show | నాకు ఏం తెలియదు.. ది రానా దగ్గుబాటి షో ట్రైలర్ వచ్చేసింది
Daaku Maharaaj | డాకు మహారాజ్‌గా బాలకృష్ణ.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న టైటిల్ టీజర్
Kanguva Twitter review | సూర్య కష్టం ఫలించిందా..? కంగువపై నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Varun Tej | వరుణ్ తేజ్‌కు ఓజీ డైరెక్టర్ సుజిత్ కథ చెప్పాడట.. కానీ