Paris Olympics : ప్రతిష్ఠాత్మక ప్యారిస్ ఒలింపిక్స్ టోర్నికి ఇంకా పదిహేను రోజులే ఉంది. విశ్వ వేదికపై పతకంతో మురిసిపోయేందుకు అన్ని దేశాల క్రీడాకారులు సిద్ధమవుతున్నారు. అయితే.. టెన్నిస్ పోటీలు మాత్రం స్టార్లు లేక కళతప్పేలా ఉన్నాయి. ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి పలువురు మహిళా టాప్ సీడ్స్ డుమ్మా కొట్టడమే అందుకు కారణం. ఇప్పటికే వరల్డ్ నంబర్ 3 అరినా సబలెంక (Aryna Sabalenka), ఎమ్మా రాడుకాను (Emma Raducanu)లు టోర్నీ నుంచి వైదొలిగారు.
తాజాగా ట్యునీషియా సంచలనం ఒన్స్ జబెర్ (Ons Jubeur) సైతం ఒలింపిక్స్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. దాంతో మహిళల సింగిల్స్ మ్యాచ్‌ల్లో మజా ఉండదని విశ్లేషకులు అంటున్నారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా టోర్నీ నుంచి వైదొలిగినట్టు జబెర్ తెలిపింది.
— Ons Jabeur (@Ons_Jabeur) June 17, 2024
‘మా వైద్యబృందంతో చర్చించాను. ప్యారిస్‌లో పరిస్థితులకు అలవాటు పడేందుకు టైమ్ పడుతుంది. అంతేకాదు నా మోకాలిని నేను రిస్క్‌లో పెట్టదలచుకోలేదు. అందుకని ఒలింపిక్స్ ఆడొద్దని భావించాను’ అని ఆమె ఎక్స్ ఖాతా పోస్ట్‌లో రాసుకొచ్చింది. జూలై 1న ఒలింపిక్స్ పోటీలు షురూ కానున్నాయి. కానీ, 17వ తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీ వరకూ టెన్నిస్ పోటీలు జరుగనున్నాయి.
ఆస్ట్రేలియన్ ఓపెన్ ట్రోఫీ విజయంతో సంచలనం సృష్టించిన సబలెంక ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్ దాటలేకపోయింది. గాయాలతో బాధపడుతున్న ఆమె కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని భావించింది. అందుకనే ఒలింపిక్స్‌లో ఆడకూడదనే నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సబలెంక బెర్లిన్‌లో కొందరు జర్నలిస్టులకు చెప్పిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Aryna Sabalenka told the press in Berlin that she won’t play the Olympic Games in Paris
Here’s the reason behind her decision👇🏼 pic.twitter.com/kCsVdnFye5
— Talking Tennis (@TalkingTennisTT) June 17, 2024
ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ సాధించిన బ్రిటన్ అమ్మాయి రాడుకాను ఆడేందుకు ఇష్టపడడం లేదు. అయితే.. గత యూఎస్ఓపెన్ నుంచి ఫామ్‌లో లేని ఆమె ఆటపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఒలింపిక్స్‌కు దూరమైనట్టు సమాచారం.