Motorola Edge 50 Ultra | మోటరోలా ప్రీమియం ఫోన్ ఎడ్జ్ 50 ఆల్ట్రా ఆవిష్కరణ.. ధరెంతంటే..?!
Motorola Edge 50 Ultra | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) ఎడ్జ్ సిరీస్‌లో తన టాప్ అప్ లైన్ ఫోన్ మోటరోలా ఎడ్జ్ 50 ఆల్ట్రా (Motorola Edge 50 Ultra) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Motorola Edge 50 Ultra | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) ఎడ్జ్ సిరీస్‌లో తన టాప్ అప్ లైన్ ఫోన్ మోటరోలా ఎడ్జ్ 50 ఆల్ట్రా (Motorola Edge 50 Ultra) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. మంగళవారం ఆవిష్కరించిన ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ఎస్వోసీ (Qualcomm Snapdragon 8s Gen 3 SoC) ప్రాసెసర్ తో పని చేస్తుంది. 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు మద్దతుతోపాటు 6.7 అంగుళాల పోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 64-మెగా పిక్సెల్ టెలిఫోటో సెన్సర్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. 125వాట్ల వైర్డ్ చార్జింగ్, 50వాట్ల వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందీ స్మార్ట్ ఫోన్.
మోటరోలా ఎడ్జ్ 50 ఆల్ట్రా (Motorola Edge 50 Ultra) ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.59,999లకు లభిస్తుంది. డార్కెస్ట్ స్ప్రూస్, పీచ్ ఫజ్, షీర్ బ్లిష్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్ కార్ట్ ద్వారా ఫోన్ విక్రయాలు జరుగుతాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.5000 ఇన్స్టంట్ డిస్కౌంట్‌తోపాటు ఇంట్రడ్యూసరీ ఆఫర్‌గా రూ.49,999లకే సొంతం చేసుకోవచ్చు.
మోటరోలా ఎడ్జ్ 50 ఆల్ట్రా (Motorola Edge 50 Ultra) ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ బేస్డ్ హెల్లో యూఐ (Hello UI) వర్షన్‌పై పని చేస్తుంది. 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, 2500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, హెచ్డీఆర్+ కంటెంట్‌కు మద్దతుగా 1.5కే (1220×2712 పిక్సెల్స్) రిజొల్యూషన్‌తో 6.7 అంగుళాల ఎల్టీపీఎస్ పోలెడ్ స్క్రీన్ తో వస్తోంది. ఒక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్ తో పని చేస్తుందీ ఫోన్.
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), ఓమ్నీ డైరెక్షనల్ ఫేజ్ డిటెక్షన్ ఆటోఫోకస్ (పీడీఏఫ్), ఎఫ్/1.6 అపెర్చర్‌తో 50-మెగా పిక్సెల్ సెన్సర్ మెయిన్ కెమెరా, 122 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ, ఎఫ్/2.0 అపెర్చర్తోపాటు 50-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఎఫ్/2.4 అపెర్చర్తోపాటు 64-మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉన్నాయి.
మోటరోలా ఎడ్జ్ 50 ఆల్ట్రా (Motorola Edge 50 Ultra) ఫోన్ బయో మెట్రిక్ అథంటికేషన్, సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్ కలిగి ఉంటుంది. ఫేస్ అన్ లాక్ ఫీచర్‌కూ మద్దతు పలుకుతుంది. కంపెనీ మోటో సెక్యూర్, థింక్ షీల్డ్ సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి.
మోటరోలా ఎడ్జ్ 50 ఆల్ట్రా (Motorola Edge 50 Ultra) ఫోన్ 125వాట్ల టర్బో పవర్ చార్జింగ్, 50వాట్ల వైర్ లెస్ చార్జింగ్, 10 వాట్ల రివర్స్ వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. సింగిల్ చార్జింగ్ తో 40 గంటల పాటు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్‌లో ఐపీ68 రేటింగ్ అందుకున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని నిలబడిన ‘రణబాలి’.. బాక్సాఫీస్ వద్ద రూ.82 కోట్ల గ్రాస్ కలెక్షన్లు!
Kaaka | ‘కాకా’ బిజినెస్‌లో మెగాస్టార్ రేంజ్.. తెలుగు రాష్ట్రాల హక్కులకు రూ.70 కోట్ల డిమాండ్!
Raaka | ఇంకా సగం పూర్తికాని ‘రాకా’ షూటింగ్.. బన్నీ ఫ్యాన్స్‌కు వెయిటింగ్ తప్పదా?
Kadem Project | కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని నిలిపివేసిన అధికారులు.. రైతుల ఆందోళన
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

