అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ద్వితీయ (Inter results ) సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు(Results ) విడుదలయ్యాయి. సంబంధిత అధికారులు ఉన్నత విద్యా శాఖా కార్యాలయంలో ఇంటర్ బోర్డు ఫలితాలను విడుదల చేశారు. పరీక్షలకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్సైట్(Website) లో ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఈ సందర్భంగా సూచించారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర వ్యాప్తంగా మే 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించగా దాదాపు 1.40 లక్షల మంది హాజరయ్యారు. ఇంటర్ మొదటి ఏడాది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు జూన్ 26న విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ ఏడాది ఇంటర్మిడియెట్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాలను తొలిసారిగా డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేశారు. ఇంటర్ ఫలితాల అనంతరం రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి పలు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు చేపడతారు. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.