Jio Down | ప్రముఖ టెలికం నెట్వర్క్ జియోసేవలు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిలిచిపోయాయి. దాంతో యూజర్లు పలు సోషల్ మీడియా అకౌంట్స్‌ను వినియోగించుకోలేకపోయామంటూ ఫిర్యాదులు చేశారు. వెబ్సైట్ ట్రాకర్ డౌన్ డిటెక్టర్ ప్రకారం.. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో జియో సేవలు నిలిచిపోయాయి. దాంతో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్), గూగుల్, టూబ్యూబ్ సహా పలు సర్వీలను వినియోగించుకోలేకపోయారు. దాదాపు 3వేల మందికిపైగా జియో సర్వీసులు పని చేయడం లేదని ఫిర్యాదు చేశారు. ఎక్స్, స్నాప్‌చాట్ వినియోగదారులు సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
జియో నెట్వర్క్ డౌన్ కావడంతో మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో వాట్సాప్ పని చేయకుండా పోయింది. ఇన్స్టాగ్రామ్, గూగుల్, ఎక్స్, స్నాప్‌చాట్ వినియోగదారులు సైతం ఏం జరుగుతుందో తెలియక తికమకపడ్డారు. అయితే, మొబైల్ ఇంటర్నెట్లో సమస్యలు తలెత్తుతున్నాయని 54 శాతం ఫిర్యాదు ఫిర్యాదు చేశారు. మరో 38శాతం జియో ఫైబర్, 7శాతం మొబైల్ నెట్‌వర్క్‌లో సమస్య ఉత్పన్నమైనట్లు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు చేసినా జియో కస్టమర్ కేర్ విభాగం పట్టించుకోవడం లేదని పలువురు మండిపడ్డారు. ప్రస్తుతం జియో సర్వీసులు నిలిపోవడంతో మీమ్స్ వెల్లువెత్తాయి.
Bhaaaai 2 Ghante ho gye….. ab to sahi kardo@JioCare @reliancejio #JioDown #JioFiberDown #InternetDown https://t.co/PjzF37rEhR
— EKSHATEK (@ekshatek) June 18, 2024