PM Modi : దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వారణాసిలో పర్యటించారు. వారణాసిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 17వ ఇన్స్టాల్మెంట్ను విడుదల చేశారు.
కృషి సఖీలకు ప్రధాని ఈ సందర్భంగా సర్టిఫికెట్లు అందచేశారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 20,000 కోట్లు జమ చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ కోట్లాడి రైతుల బ్యాంక్ ఖాతాలకు రూ. 3.24 లక్షల కోట్లు ట్రాన్స్ఫర్ చేశారని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు.
ఇక ప్రధాని మోదీ నేతృత్వంలో యూపీ దేశంలోనే వేగంగా ఎదుగుతున్న ఎకానమీగా ముందుకు సాగుతున్నదని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ పేర్కొన్నారు. ప్రపంచంలో భారత్కు ప్రధాని మోదీ సరికొత్త గుర్తింపును తీసుకువచ్చారని ప్రశంసించారు.
Read More :