కూచ్ బెహార్: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) ఇవాళ కూచ్ బెహార్లో ఉన్న బీజేపీ రాజ్యసభ ఎంపీ అనంత్ మహారాజ్ నివాసానికి వెళ్లారు. సుమారు 35 నిమిషాల పాటు ఆమె ఆ ఎంపీతో ముచ్చటించారు. దీంతో ఆ భేటీకి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నది. చకాచకా ప్యాలెస్‌కు వెళ్లిన దీదీకి .. నాగేంద్ర రాయ్ వెల్కమ్ పలికారు. సంప్రదాయ స్కార్ఫ్, తమలపాకులను ఆమెకు అందజేశారు. ఎంపీ ఇంటికి వెళ్లడానికి ముందు జిల్లా ప్రధాన కార్యాలయంలో మదన్ మోహన్ ఆలయాన్ని ఆమె విజిట్ చేశారు. కాంచన్‌జంగా రైలు ప్రమాద బాధితులు సిలిగురిలోని మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. వారిని పరామర్శించేందుకు మమతా బెనర్జీ అక్కడికి వెళ్లారు. దానిలో భాగంగా ఆమె కూచ్ బీహార్ వెళ్లి బీజేపీ రాజ్యసభ సభ్యుడిని కలిశారు. బెంగాల్ బీజేపీ పార్టీ ఈ భేటీపై ఇంకా స్పందించలేదు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూచ్ బెహార్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నిశిత్ ప్రామానిక్ సుమారు 40 వేల ఓట్ల తేడాతో టీఎంసీ అభ్యర్థి జగదీశ్ చంద్ర బర్మా బసునియా చేతిలో ఓటమిపాలయ్యారు.
#WATCH | West Bengal Chief Minister Mamata Banerjee meets Greater Cooch Behar People’s Association leader and BJP MP Nagendra Ray alias Anant Maharaj.
The West Bengal CM also offered prayers at Madan Mohan Temple, in Cooch Behar. pic.twitter.com/dFQkK4W8cY
— ANI (@ANI) June 18, 2024