Vinesh Phogat : పారిస్ ఒలింపిక్స్‌లో పతకం ఆశలు రేపి.. ఊహించని రీతిలో అనర్హతకు గురైన రెజ్లర్ వినేశ్ ఫోగట్ (Vinesh Phogat) భారత క్రీడాలోకం మద్దతు పలుకుతోంది. 100 గ్రాముల అదనపు బరువు విషయమై విశ్వ క్రీడల నుంచి వైదొలిగిన వినేశ్‌కు పలువురు క్రీడాకారిణులు అండగా నిలిచారు. ‘యావత్ భారత్ నిన్ను చూసి గర్విస్తోంది. నీ పోరాటం అద్భుతం’ అంటూ రెజ్లర్‌కు సంఘీభావం ప్రకటిస్తున్నారు.
‘వినేశ్ నువ్వొక చాంపియన్’ అంటూ ఒలింపిక్ విజేతలు పీవీ సింధు (PV Sindhu), సాక్షి మాలిక్(Sakshi Malik)లు ఎక్స్ వేదికగా పోస్ట్‌లు పెట్టారు. ‘ప్రియమైన వినేశ్ ఫోగట్.. నువ్వు మా దృష్టిలో నువ్వు ఎప్పుడూ చాంపియనే. నువ్వు స్వర్ణం గెలుస్తావని నేను ఎంతో నమ్మాను. నువ్వొక సూపర్ హ్యూమన్. నేను ఎల్లప్పుడూ నీవెంటే ఉంటాను. విశ్వంలోని సానుకూల దృక్ఫధాన్ని నీకు పంపిస్తున్నా’ అంటూ సింధు ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. మరోవైపు మాజీ రెజ్లర్ సాక్షి మాలిక్ సైతం వినేశ్‌కు అండగా ఉన్నానంటూ ప్రకటించింది.
Dear @Phogat_Vinesh, you will always be a champion in our eyes. I was deeply hoping you could win the gold. The little time I spent with you at PDCSE was watching a woman with a superhuman will fight to get better. It was inspiring. I am here for you always, sending all the…
— Pvsindhu (@Pvsindhu1) August 7, 2024
మూడో ఒలింపిక్స్ ఆడుతున్న వినేశ్ ఫోగట్ ఈసారి 50 కిలోల విభాగంలో బరిలోకి దిగింది. తొలి బౌట్‌లోనే వరల్డ్ నంబర్ 1 లీ సుసానీకి చెక్ పెట్టిన వినేశ్.. ఆ తర్వాత ఉక్రెయిన్ రెజ్లర్ ఒక్సానా లివాచ్ (Oksana Livach)ను మట్టికరిపించింది. ఇక సెమీ ఫైనల్లోనూ ఉడుంపట్టుతో విజృంభించిన ఆమె క్యూబా రెజ్లర్‌ను 5-0తో చిత్తు చేసింది. దాంతో, ఫైనల్‌కు చేరిన భారత తొలి మహిళా రెజ్లర్‌గా వినేశ్ రికార్డు నెలకొల్పింది.
ఇక ఫైనల్లో గోల్డ్ మెడల్‌తో దేశాన్ని గర్వించేలా చేయాలనుకున్న వినేశ్‌కు ఊహించని షాక్ తగిలింది. 50 కిలోల కంటే అదనంగా 100 గ్రాములు ఉందని నిర్వాహకులు ఆమెపై అనర్షత వేటు వేశారు. దాంతో, కోట్లాదిమంది అదొక పీడకల అయి ఉంటే బాగుండు అంటూ సోషల్ మీడియాలతో తమ బాధను తెలియజేస్తున్నారు.