Peddi |మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ నిర్మాణంలో, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే టీజర్, పాటలతో అంచనాలను ఆకాశానికి చేర్చింది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్‌తో పాటు పలువురు బాలీవుడ్ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లోని క్రికెట్ షాట్, అలాగే ‘చికిరి చికిరి’ పాట స్టెప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. మార్చి 27న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, చిత్ర యూనిట్ షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది. ప్రస్తుతం ‘పెద్ది’ షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది.
ఈ షెడ్యూల్ కోసం యూనిట్ రాజధానిలో భారీ ఏర్పాట్లు చేసింది. అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంతో పాటు, ఏపీ భవన్, పార్లమెంట్ పరిసర ప్రాంతాలు, ఇండియా గేట్ వద్ద కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు, ప్రధాని కార్యాలయం పరిధిలోనూ, ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం అండ్ లైబ్రరీ – ప్రధానమంత్రి సంగ్రహాలయలో కూడా షూటింగ్ జరగనుందని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం, లైబ్రరీని సందర్శించి అక్కడి అధికారులను కలిసిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. RRR సినిమా తర్వాత రామ్ చరణ్‌కు ఉత్తర భారతంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఢిల్లీలో ‘పెద్ది’ షూటింగ్ జరుగుతుండటంతో, చరణ్‌ను ఒక్కసారి చూడాలనే ఉత్సాహంతో పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకుంటున్నారు. అభిమానులే కాకుండా, అక్కడి పోలీస్ సిబ్బంది కూడా చరణ్‌తో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించడంతో ఆ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.ఢిల్లీలో షూటింగ్, అరుణ్ జైట్లీ స్టేడియంలో కీలక సన్నివేశాలు, ప్రధాని కార్యాలయం పరిధిలో చిత్రీకరణ వంటి అంశాలు చూసి, దర్శకుడు బుచ్చిబాబు సానా ఏదో పెద్ద ప్లాన్‌తోనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో తీస్తున్న విజువల్స్ ‘పెద్ది’పై ఉన్న హైప్‌ను మరింత పెంచుతున్నాయి. మొత్తానికి, రామ్ చరణ్ కెరీర్లో మరో భారీ చిత్రంగా నిలవనున్న ‘పెద్ది’ పై అంచనాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.
MEGA POWER STAR @AlwaysRamCharan Garu visited PMML Yesterday and explored the Pradhanmantri Sangrahalaya and
His warm interaction with visitors and children.#RamCharan pic.twitter.com/a36QDbkk9D— RamCharan Updates (@RCoffTeam) December 24, 2025