KTR | ఇచ్చిన హామీలన్ని నెరవేర్చేదాకా.. కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీస్తాం: కేటీఆర్
KTR | ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. ఎన్నికలు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిందేనని స్పష్టం చేశారు.
KTR | ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. ఎన్నికలు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిందేనని స్పష్టం చేశారు.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఆరు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం గన్‌పార్క్ నుంచి అసెంబ్లీకి ర్యాలీకి బయల్దేరి వచ్చారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యమని గ్యారంటీ కార్డులు ఇచ్చి భద్రం చేసుకోమన్నారని గుర్తుచేశారు. ఇంతవరకు ఒక్క గ్యారంటీని నెరవేర్చిందని లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజల తరఫున వృద్ధులు, వితంతువుల తరఫున బడ్జెట్ ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. రూ.2500 మహాలక్ష్మీ నిధులు ఎప్పుడిస్తారని నిలదీస్తామని తెలిపారు. కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు నీటిమూటలయ్యాయని విమర్శించారు.
బడ్జెట్లో రైతులకు, బీసీలకు జరుగుతున్న అన్యాయంపై నిలదీస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. సంక్రాంతి, ఉగాది గడిచినా రైతు భరోసా పడలేదని అన్నారు. ఉద్యోగాలపై బొంకుతున్న కాంగ్రెస్‌ను అసెంబ్లీలో నిలదీస్తామని తెలిపారు. హామీలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
Japan | జపాన్‌లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

