Ponguleti Srinivas Reddy | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు హర్ష కబ్జా బాగోతం మరోసారి బయటపడింది. 300 కోట్ల వట్టినాగులపల్లిలోని 20 ఎకరాల ప్రైవేటు స్థలం కబ్జా చేసేందుకు దౌర్జన్యానికి పాల్పడ్డాడు.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లిలోని 300 కోట్ల విలువైన 20 ఎకరాల ప్రైవేట్ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు యత్నించాడు. పొంగులేటి కొడుకు అనుచరులు పట్టపగలే ముఖానికి మాస్కులు ధరించి, ప్రహారీ గోడ కూల్చేశారు. యజమానులు హైకోర్టు ఆర్డర్ చూపించినా, మా బాస్ కూల్చేయమన్నాడని దౌర్జన్యం చేవారు.
దాదాపు 30 సార్లు 100కు ఫోన్ చేసినా, పోలీసులు రాలేదని, రెండు గంటల అనంతరం వచ్చి, రౌడీలను కాకుండా తమ వద్ద పనిచేసే వారిని తీసుకెళ్లారని యజమానుల ఆరోపించారు. 40 ఏళ్ల క్రితమే ఈ భూమి తమ పేరిట రిజిస్ట్రేషన్ అయిందని, గతంలో ఇలాగే దౌర్జన్యం చేస్తే తమ ఫిర్యాదు మేరకు పొంగులేటి కొడుకు హర్షపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీస్ అధికారిని సస్పెండ్ చేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు.