Viral Video | వెరైటీ ఫుడ్ కాంబినేషన్ : స్ట్రాబెర్రీ ఎగ్ డిష్
Viral Video : ఆమ్లెట్, ఎగ్ కర్రీ, ఎగ్ ఫ్రై ఇలా ఎగ్‌తో ఏం చేసినా అందరూ ఇష్టంగా తింటారు. ఎన్నో పోషక విలువలు కలిగిన ఎగ్‌ను ఏ రూపంలో అయినా తీసుకునేందుకు ఇష్టపడతారు. అయితే సోషల్ మీడియా యుగంలో ఫుడ్‌పైనా ప్రయోగాలు చేస్తున్నారు.
Viral Video : ఆమ్లెట్, ఎగ్ కర్రీ, ఎగ్ ఫ్రై ఇలా ఎగ్‌తో ఏం చేసినా అందరూ ఇష్టంగా తింటారు. ఎన్నో పోషక విలువలు కలిగిన ఎగ్‌ను ఏ రూపంలో అయినా తీసుకునేందుకు ఇష్టపడతారు. అయితే సోషల్ మీడియా యుగంలో ఫుడ్‌పైనా ప్రయోగాలు చేస్తున్నారు. చిత్రవిచిత్ర ఫుడ్ కాంబినేషన్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్గా స్ట్రాబెర్రీ ఎగ్ డిష్ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది.
డిజిటల్ కంటెంట్ క్రియేటర్ మయాంక్ పటేల్ సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ స్ట్రీట్ వెండార్ ఈ అసాధారణ డిష్ ప్రిపేర్ చేయడం కనిపిస్తుంది. ఈ క్లిప్‌లో పెనంపై వీధి వ్యాపారి నూనె వేసి ఆపై రెండు క్యాప్సికమ్‌లను ఫ్రై చేయడం చూడొచ్చు. ఆపై ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్, స్ట్రాబెర్రీ ఫ్రై చేసి అందులో చీజ్, మయనీస్ జోడిస్తారు. దానిపై చాట్ మసాలా, టమాటా ముక్కలు, ఇతర స్పైసెస్ యాడ్ చేయడం కనిపిస్తుంది. ఆపై వీటిని బాగా మిక్స్ చేసి గ్రేవీలా తయారు చేస్తాడు.
కొద్ది సేపు కుక్ చేసిన తర్వాత ఈ మిక్సర్‌ను క్యాప్సికమ్స్‌లో వేయడం క్లిప్‌లో కనిపిస్తుంది. తర్వాత ఎగ్‌ను పగలకొట్టి రెండు క్యాప్సికమ్స్‌లో వేయడం చూడొచ్చు. మళ్లీ వాటిలో మసాలాను యాడ్ చేసి స్ట్రాబెర్రీస్, కరివేపాకుతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తాడు. ఇక ఈ వీడియోకు ఇన్‌స్టాగ్రాంలో ఇప్పటివరకూ 40 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. అయితే ఇదేం ఫుడ్ కాంబినేషన్ అని పలువురు ఇంటర్నెట్ యూజర్లు పెదవివిరిచారు. ఫుడ్ పాయిజనింగ్ అని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఎగ్ మినహా అన్నింటినీ కుక్ చేశాడని మరో యూజర్ కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు. స్ట్రాబెర్రీకి న్యాయం చేశాడని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read More :
Kriti Sanan | తన కంటే 7 ఏండ్లు చిన్నవాడితో డేటింగ్ చేస్తున్న కృతిసనన్.?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

