Kriti Sanan | బాలీవుడ్ నటి, నేషనల్ అవార్డు విన్నర్ కృతిసనన్ గురించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్లో తనకంటూ స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అయితే ఈ భామ ప్రేమలో పడినట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్న విషయం తెలిసిందే. కృతి తనకన్నా చిన్నవాడు అయిన కబీర్ అనే అబ్బాయితో డేటింగ్లో ఉన్నట్లు పలుసార్లు రూమర్స్ వినిపించాయి. అయితే ఈ వార్తలు ఇప్పుడు నిజం అని తెలుస్తుంది. కృతిసనన్ గత నెల జూలై 27న తన బర్త్‌డేను గ్రాండ్‌గా జరుపుకున్న విషయం తెలిసిందే.
తన 34వ బర్త్‌డే కోసం గ్రీస్‌లోని ఓ ఐలాండ్‌ను కృతి బుక్ చేసుకున్నారని సమాచారం. ఇక ఈ పుట్టినరోజు వేడుకలకు కృతి చెల్లెలితో పాటు కృతి రూమర్ బాయ్ ఫ్రెండ్ కబీర్ బహియా కూడా పాల్గొన్నాడు. ఇక ఈ ఐలాండ్‌లో కబీర్‌తో కృతి చిల్ అవుతున్న ఫొటోలు, రెస్టారెంట్లో కలిసి భోజనం చేస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది వచ్చిన తేరీ బాతోన్ మే ఐసా ఉల్ఝా జియా, క్రూ సినిమాలతో మంచి హిట్లను అందుకుంది కృతి సనన్. ప్రస్తుతం దో పట్టి అనే సినిమాలో నటిస్తుంది ఈ భామ.
కబీర్ బాహియా విషయానికి వస్తే.. యుకేకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు అని సమాచారం. అంతేకాకుండా అతడి లింక్డ్ ఇన్‌లో ఉన్న బయో ప్రకారం వరల్డ్‌వైడ్ ఏవియేషన్ అండ్ టూరిజంలో మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. మరోవైపు అతడికి భారత్ క్రికెటర్లు ధోని, పాండ్యాతో పాటు చాలా మంది పరిచయం ఉన్నట్లు తెలుస్తుంది.
Also Read..
Gaurav Gogoi | ఆయన రైల్వే మంత్రి కాదు..రీల్ మంత్రి, డిరైల్మెంట్ మంత్రి : కాంగ్రెస్
Vettaiyan | రజినీకాంత్‌తో నా తొలి సినిమా.. వెట్టైయాన్‌లో తన పాత్ర ఏంటో చెప్పిన మంజువారియర్