Vettaiyan | వరుస సినిమాలను లైన్లో పెట్టాడు తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth). వీటిలో ఒకటి వెట్టైయాన్ Vettaiyan. తలైవా 170గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ (TJ Gnanavel) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) కీలక పాత్రల్లో నటిస్తుండగా.. ఈ సినిమాలో దుషారా విజయన్, రితికా సింగ్ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. మంజు వారియర్, రానా దగ్గుబాటి, రావు రమేశ్, రోహిణి మొల్లేటి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రంలో తన పాత్ర గురించి క్లారిటీ ఇచ్చింది మంజు వారియర్. నేను జైభీమ్ సినిమా చూసిన తర్వాత జ్ఞానవేళ్ సార్‌కు అభిమానిని అయ్యా. వెట్టైయాన్ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇందులో రజినీకాంత్ సార్ సతీమణిగా కనిపిస్తా. రజినీ సార్‌తో నా తొలి సినిమా ఇది. నా పాత్ర చాలా ఆసక్తికరంగా సాగుతుందని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్‌తో సిల్వర్ స్క్రీన్‌పై మంజు వారియర్, తలైవా కాంబో ఎలా కనిపించబోతున్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన వెట్టైయాన్ టైటిల్ టీజర్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) బ్యానర్‌పై సుబాస్కరన్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రజినీకాంత్ మరోవైపు తలైవా 171గా తెరకెక్కుతున్న కూలి చిత్రంలో కూడా నటిస్తున్నాడని తెలిసిందే.
#Exclusive :#Vettaiyan is a perfect combination; In the film, I will be Rajini sir’s wife’;
I Became fan of @tjgnan sir after watching #JaiBhim– @ManjuWarrier4 pic.twitter.com/naaLkohTrs
— 𝕯𝖆𝖗𝖐 𝖐𝖎𝖓𝖌 (@Mr_Dark92) August 1, 2024
Thangalaan | తుఫాను వచ్చేస్తుంది.. విక్రమ్ తంగలాన్ అడ్వెంచరస్ రైడ్‌కు రెడీనా..?
NBK 109 | షూటింగ్ స్పాట్లో బాబీ.. బాలకృష్ణ ఎన్బీకే 109 డైరెక్టర్‌కు బర్త్ డే విషెస్
Buddy | ఇంతకీ అల్లు శిరీష్ బడ్డీలో టెడ్డీబేర్ పాత్రలో నటించిందెవరో తెలుసా..?
Vettaiyan టైటిల్ టీజర్..