KU Girls Hostel | హనుమకొండ చౌరస్తా, జనవరి 8: హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో గురువారం పెట్టిన భోజనంలో పురుగులు, ఇనుప మేకులు వచ్చాయి. దీంతో విద్యార్థులు కే యూ పరిపాలనా భవనాన్ని ముట్టడించి వర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెస్‌లో నాణ్యమైన భోజనం అందించడంలేదని, ఉడికీ ఉడకని అన్నం, నీళ్లచారు పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
హాస్టల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్లు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని, నాణ్యమైన భోజనా న్ని అందించాలని డిమాం డ్ చేశారు. అనంతరం వీసీకి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు స్పందించిన వీసీ హాస్టల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్లపై సీరియస్ అయ్యారు.