హైదరాబాద్, జనవరి 8(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం అనుమతిలేని, నిషేధిత హెచ్‌టీ(బీజీ-3) పత్తి విత్తనాలు రాష్ట్రంలోకి రాకుండా, రైతులకు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి టాస్‌ఫోర్స్ టీమ్‌లు ఏర్పాటుచేసి నిఘా పెంచాలని సూచించారు. ఈ మేరకు పత్తి విత్తనాల ప్యాకెట్లను సమకూర్చడంపై సమీక్షించారు.
హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): బూత్ లెవల్ అధికారుల(బీఎల్వోలు) ఫోన్నంబర్లకు విస్తృత ప్రచారం కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) సీ సుదర్శన్‌రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులను ఆదేశించారు. ‘బుక్-ఏ-కాల్స్ విత్ బీఎల్వో’ సౌకర్యాన్ని ప్రజలు వినియోగించేలా ప్రోత్సహించాలని సూచించారు.