Bhu Bharati | భూ భారతి రిజిస్ట్రేషన్ల చలానా కుంభకోణం.. యాదాద్రి కేంద్రంగా స్లాట్ బుకింగ్ దందా
Bhu Bharati | భూ భారతిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చలాన్ల చెల్లింపులో భారీ కుంభకోణం జరిగినట్టు తెలుస్తున్నది. భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మీసేవ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటే అక్కడే చలాన్ ఇస్తారు.
Bhu Bharati | జనగామ, జనవరి 8 (నమస్తే తెలంగాణ): భూ భారతిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చలాన్ల చెల్లింపులో భారీ కుంభకోణం జరిగినట్టు తెలుస్తున్నది. భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మీసేవ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటే అక్కడే చలాన్ ఇస్తారు. ఓ గ్రామంలో వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కోసం యాదాద్రిలో స్లాట్ బుక్ చేసుకొన్న కొనుగోలుదారుడు గురువారం జనగామ తహసీల్దార్ కార్యాలయానికి చలాన్ తీసుకొచ్చాడు.
భూమి విలువ, చెల్లించిన చలాన్‌కు పొంతన లేకపోవడం, చలాన్ ఎడిటింగ్ (మార్ఫింగ్) చేసినట్టు తహసీల్దార్‌కు అనుమానం రావడంతో కలెక్టర్, డీసీపీ, ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ సూచనలతో జనగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌తోపాటు జిల్లా యంత్రాగం జనగామ తహసీల్ కార్యాలయానికి చేరుకొని రికార్డులు పరిశీలించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తున్నది. తహసీల్ కార్యాలయంలో భూ భారతి సాఫ్ట్వేర్ సమస్యను పరిశీలించేందుకు వచ్చామని కలెక్టర్, ఆర్డీవో, డీసీపీ చెప్పడం గమనార్హం.
కీలక సూత్రధారి యాదాద్రి వాసి?
జనగామలో భూభారతి చలాన్ల స్కామ్ వెలుగులోకి రావడంతో ఉలిక్కిపడ్డ రెవెన్యూ అధికారులు దిద్దుబాటు చర్యలను ప్రారంభించారు. సూత్రధారిగా అనుమానిస్తున్న యాదాద్రి భువనగిరి మీ సేవ కేంద్రం నిర్వాహకుడిని గురువారం వరంగల్ సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకొని సీపీ ఎదుట హాజరుపరిచి విచారిస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్‌లోని మీ సేవ కేంద్రం, నెట్ బ్యాంకింగ్ నిర్వాహకుడు చలాన్ల స్కామ్‌లో ప్రధాన సూత్రధారిగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ కుంభకోణం ద్వారా రూ.8.55 లక్షల మేర ప్రభుత్వ ఖజానాకు గండిపడినట్టు అధికారులు గుర్తించినట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

