హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ ): యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూల్స్లో మొదటి విడుతలో బాలికలకు ఎకువ సీట్లు కేటాయించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
మరో విడుతలో బాలురకు కేటాయించాలని పేర్కొన్నారు. రానున్న మూడేండ్లలో ప్రతి నియోజకవర్గంలోనూ బాలురు, బాలికలకు ఒక్కొకటి చొప్పున వైఐఐఆర్ఎస్ల నిర్మాణాలు పూర్తి చేయాల్సిందేనని ఆదేశించారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు.