(Oldest Cricketer) లండన్ : అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వృద్ధురాలు అయిన ఎలీన్ యాష్ కన్నుమూసింది. ఆమె వయస్సు 110 సంవత్సరాలు. యాష్ మృతి సమాచారాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ శనివారం వెల్లడించింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో యాష్ ఇంగ్లండ్ తరపున ఏడు టెస్టు మ్యాచ్‌లు ఆడారు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్‌గా కూడా సేవలందించారు. 1937లో ఇంగ్లండ్ తరపున అరంగేట్రం చేసిన యాష్.. 23 సగటుతో 10 వికెట్లు తీశారు. క్రికెట్ కెరీర్‌తో పాటు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఎంఐ 6 సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ కోసం కూడా పనిచేశారు.
యాష్ దేశవాళీ క్రికెట్లో మహిళల సివిల్ సర్వీస్ జట్టు, మహిళల మిడిల్సెక్స్ జట్టు తరఫున కూడా ఆడారు. 1937లో నార్తాంప్టన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఇంగ్లండ్ తరఫున ఆడారు. 1949లో ఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ టూర్లో కూడా భాగస్వామ్యమయ్యారు. అదే సంవత్సరం క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఎలీన్ యాష్ మరణం పట్ల ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? అయితే, ఒకసారి ఆలోచించండి..!
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
ఈ ‘ముక్కు’ రోగాలను పసిగడుతుంది.. ఎలాగంటే?
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..