Tim Southee : వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023) ముందు న్యూజిలాండ్(Newzealand) అభిమానులకు పెద్ద షాక్. స్టార్ పేసర్ టిమ్ సౌథీ(Tim Southee) గాయపడ్డాడు. లార్డ్స్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో సౌథీ కుడి బొటనవేలికి దెబ్బ తగిలింది. బెన్ లీస్టర్(Ben Leister) వేసిన 14వ ఓవర్లో జో రూట్(Joe Root) ఇచ్చిన క్యాచ్‌ను అందుకునే ప్రయత్నంలో సౌథీ గాయపడ్డాడు. నొప్పితో విలవిలలాడిన అతడిని వైద్యబృందం బయటకు తీసుకెళ్లింది. ఆ తర్వాత అతను మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు.
‘బెన్ లీస్టర్ బౌలింగ్‌లో క్యాచ్ పట్టబోయిన టిమ్ సౌథీ బొటన వేలికి గాయమైంది. అయితే.. గాయం తీవ్రత తెలుసుకునేందుకు మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉంది. ఇప్పటికైతే అతను మళ్లీ మైదానంలోకి రావడం కష్టమే’ అని న్యూజిలాండ్ క్రికెట్ (Newzealand Cricket) ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టింది.
Tim Southee has left the field having injured his right thumb attempting to take a catch off Ben Lister. The injury requires further assessment and he won’t to return to the field at this stage.#ENGvNZ #CricketNation pic.twitter.com/ChjW8Z1c8J
— BLACKCAPS (@BLACKCAPS) September 15, 2023
ఇదే మ్యాచ్‌లో కివీస్ ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్(Daryl Mitchell) కూడా గాయపడ్డాడు. జానీ బెయిర్‌స్టో(Johny Bairstow) క్యాచ్ పట్టిన అతడి ఎడమచేతి ఉంగరం వేలు బెణికింది. అయితే.. కాసేపటికే మిచెల్ మళ్లీ మైదానంలోకి వచ్చాడు. వచ్చీ రావడంతోనే కెప్టెన్ జోస్ బట్లర్(36) వికెట్ తీశాడు.
కెప్టెన్ కేన్ విలియమ్సన్
నాలుగేళ్ల క్రితం రన్నరప్‌గా నిలిచిన కివీస్ ఈసారి ట్రోఫీపై కన్నేసింది. అయితే.. కెప్టెన్ కేన్ విలియమ్సన్(Kane Williamson) ఇంకా ఫామ్ చాటుకోలేదు. మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న అతను వరల్డ్ కప్ స్క్వాడ్‌లో అయితే చోటు దక్కించుకున్నాడు. కానీ, ఎప్పటి నుంచి బరిలోకి దిగుతాడు? అనేది తెలియాల్సి ఉంది. విలియమ్సన్ ఫిట్నెస్ సాధించే లోపు వైస్ కెప్టెన్ టామ్ లాథమ్(Tom Latham) సారథిగా వ్యవహరించనున్నాడు. అక్టోబర్ 5న భారత గడ్డపై వరల్డ్ కప్ షురూ కానుంది. అదే రోజు జరిగే అరంభ పోరులో ఇంగ్లండ్‌తో తలపడనుంది.