Shahid Afridi | వికెట్ పడకపోతే అతడికి పిచ్చెక్కుతుంది.. అల్లుడిపై ఆఫ్రిది షాకింగ్ కామెంట్స్
Shahid Afridi : పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది(Shaheen Afridi) కొత్త బంతితో ప్రత్యర్థులకు చుక్కులు చూపిస్తాడని తెలిసిందే. వేగంతో పాటు స్వింగ్ జోడించి జట్టుకు శుభారంభాలు ఇస్తుంటాడు. ఆసియా కప్‌లోనూ దుమ్మురేపిన ఈ స్టార్ పేసర్ గురించి అతడి మామ, పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది(Shahid Afridi) ఆసక్తికర విషయాలు....
Shahid Afridi : పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది(Shaheen Afridi) కొత్త బంతితో ప్రత్యర్థులకు చుక్కులు చూపిస్తాడని తెలిసిందే. వేగంతో పాటు స్వింగ్ జోడించి జట్టుకు శుభారంభాలు ఇస్తుంటాడు. ఆసియా కప్‌లోనూ దుమ్మురేపిన ఈ స్టార్ పేసర్ గురించి అతడి మామ, పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది(Shahid Afridi) ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఆరంభంలోనే వికెట్ దక్కకపోతే షాహీన్‌కు పిచ్చెక్కుతుందని అతను అన్నాడు.
తొలి స్పెల్‌లో వికెట్ పడగొట్టలేకపోతే కోపోద్రిక్తుడవుతాడని అఫ్రిది తెలిపాడు. ‘అతడికి త్వరగా వికెట్లు దక్కకపోతే అగ్రహానికి గురవుతాడు. ఇది ఈ ఒక్క మ్యాచ్ అనే కాదు ఎప్పుడూ ఇంతే’ అని అఫ్రిది పేర్కొన్నాడు. దీంతో అల్లుడి షాహీన్‌పై మామ ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. షాహిద్ అఫ్రిది పెద్ద కుమార్తే అన్ష అఫ్రిది(Ansha Afridi)తో ఈ ఏడాది ఆరంభంలో షాహీన్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. మరోవైపు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్(Younis Khan) కూడా ఆటగాళ్ల తీరుపై మండిపడ్డాడు. జట్టు అవసరాలకు తగ్గట్లు ఆడాలే తప్ప వాళ్లకు నచ్చిన స్థానంలో ఆడడం సరికాదని యూనిస్ అన్నాడు.
పేసర్ షాహీన్ షా అఫ్రిది

ఆసియా కప్(Asia Cup 2023) లీగ్ దశలో మ్యాచ్‌లో భారత్‌పై ఆరంభంలోనే వికెట్లు తీసి షాహీన్ జట్టుకు శుభారంభం ఇచ్చాడు. ఒకే ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma)ను ఔట్ చేసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. కానీ, కీలకమైన సూపర్-4లో టీమ్ఇండియాపై షాహీన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అతడి బౌలింగ్‌ను చీల్చి చెండాడారు.
తొలి మూడు ఓవర్లలోనే కనీసం ఒక్క వికెట్ అయినా పడగొట్టే షాహీన్‌ను ఉతికిఆరేస్తూ మనవాళ్లు 31 పరుగులు రాబట్టారు. దీంతో ఈ స్పీడ్‌స్టర్ ఒక్కసారిగా డీలాపడిపోయాడు. రోహిత్, గిల్ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ(122 నాటౌట్), కేఎల్ రాహుల్(111 నాటౌట్) కూడా ఊచకోతను కొనసాగించారు. వీళ్లిద్దరూ శతకాలతో విరుచుకుపడిన ఈ మ్యాచ్‌లో ఇండియా 228 పరుగుల భారీ తేడాతో దాయాదిని చిత్తు చేసింది.
ఇవి కూడా చదవండి
Ravindra Jadeja | జడ్డూ పేరిట మరో రికార్డు.. ఏడో భారత బౌలర్‌గా ఘనత
Asia Cup 2023 | ఎనిమిదోసారి టైటిల్ పోరులో భారత్, శ్రీలంక.. ఈసారి పైచేయి ఎవరిదయ్యేనో..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

