Ravindra Jadeja : టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) మరో మైలురాయిని అధిగమించాడు. వన్డే క్రికెట్లో 200వ వికెట్ తీశాడు. ఆసియా కప్(Asia Cup 2023) సూపర్ 4 చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై జడ్డూ ఈ ఫీట్ సాధించాడు. షమీమ్ హొసేన్(1)ను ఎల్బీగా ఔట్ చేసి ఈ ఫార్మాట్లో 200 వికెట్ల క్లబ్లో చేరాడు. దాంతో, ఈ ఘనత సొంతం చేసుకున్న ఏడో భారత బౌలరగా జడేజా నిలిచాడు. 175వ ఇన్నింగ్స్‌ల్లో అతను ఈ రికార్డు నెలకొల్పాడు.
అనిల్ కుంబ్లే(334), జవగల్ శ్రీనాథ్(315), అజిత్ అగార్కర్(288), జహీర్ ఖాన్(269), హర్భజన్ సింగ్(265), కపిల్ దేవ్(253)లు మాత్రమే జడ్డూ కంటే ముందున్నారు. మరో విషయం ఏంటంటే..? భారత్ తరఫున ఈ ఫీట్ నమోదు చేసిన మూడో స్పిన్నర్ జడేజానే కావడం విశేషం. అంతేకాదు 2వేల పరుగులు, 200 వికెట్లతో కపిల్ దేవ్ సరసన నిలిచాడు.
A Special DOUBLE Hundred 👏👏
Well done, Ravindra Jadeja!
Follow the match – https://t.co/OHhiRDZM6W#TeamIndia | #AsiaCup2023 | #INDvBAN pic.twitter.com/9RZE0SUSYL
— BCCI (@BCCI) September 15, 2023
గత పదేళ్లుగా జడ్డూ భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీలంక, పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న ఆసియా కప్‌లోనూ జడేజా విజృంభిస్తున్నాడు. సెప్టెంబర్ 12న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆ సార్ట్ ప్లేయర్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. ధనంజయ డిసిల్వా, దసున్ శనకను ఔట్ చేసి లంకను దెబ్బకొట్టాడు. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో రాణించడంతో టీమిండియా 41 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో సెప్టెంబర్ 17న లంక, ఇండియా జట్ల మధ్య టైటిల్ పోరు జరుగనుంది.