Asia Cup 2023 | షకిబుల్ హసన్ 55వ హాఫ్ సెంచరీ.. కోలుకున్న బంగ్లాదేశ్
Asia Cup 2023 : బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబుల్ హసన్(Shakib Al Hasan) మరో ఘనత సాధించాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ వన్డేల్లో 55వ అర్థ శతకం బాదాడు. ఆసియా కప్ సూపర్ 4 చివరి మ్యాచ్‌లో భారత జట్టుపై షకిబ్ కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. అక్షర్ పటేల్(Axar Patel)...
Asia Cup 2023 : బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబుల్ హసన్(Shakib Al Hasan) మరో ఘనత సాధించాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ వన్డేల్లో 55వ అర్థ శతకం బాదాడు. ఆసియా కప్ సూపర్ 4 చివరి మ్యాచ్‌లో భారత జట్టుపై షకిబ్ కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. అక్షర్ పటేల్(Axar Patel) బౌలింగ్‌లో సిక్సర్ బాది ఫిఫ్టీకి చేరువయ్యాడు. షకిబ్ 55 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 50 రన్స్ చేశాడు.
శార్దూల్ ఠాకూర్ దెబ్బకు బంగ్లా 44 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన షకిబ్ ఆల్‌రౌండర్ మెహిదీ హసన్ మిరాజ్(13), తౌహిద్ హృదోయ్(28 నాటౌట్)తో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. 29 ఓవర్లకు బంగ్లా స్కోర్.. 133/4. ప్రస్తుతం షకిబ్ 66 పరుగులతో ఆడుతున్నాడు.
Skipper Shakib leading from the front 🇧🇩 #INDvBAN LIVE ▶️ https://t.co/AMJLzWVWJV#AsiaCup2023 pic.twitter.com/mI5m6YZO0i
— ESPNcricinfo (@ESPNcricinfo) September 15, 2023
నామమాత్రమైన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగారు. దాంతో బంగ్లాదేశ్ పవర్ ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోయింది. డేంజరస్ ఓపెనర్ లిట్టన్ దాస్(0) డకౌటయ్యాడు. మరో ఓపెనర్ తంజిద్ హసన్(13)ను శార్థూల్ ఠాకూర్ బౌల్డ్ చేశాడు. అనాముల్ హక్(4)ను కూడా శార్దూల్ పెవిలియన్ పంపాడు. దాంతో బంగ్లా 10 ఓవర్లలో3 వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇండియా ఐదు మార్పులతో ఆడుతోంది.
Edged & taken!
Wicket for Axar Patel as captain Rohit Sharma takes a fine catch 🙌 🙌
Bangladesh lose their 4th wicket as Mehidy Hasan Miraz departs.
Follow the match ▶️ https://t.co/OHhiRDZM6W #TeamIndia | #AsiaCup2023 | #INDvBAN pic.twitter.com/pfBW3ujtug
— BCCI (@BCCI) September 15, 2023
స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లకు మేనేజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. ఈ మ్యాచ్‌తో తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నాడు. మ్యాచ్‌కు ముందు అతడు కెప్టెన్ రోహిత్ నుంచి డెబ్యూట్ క్యాప్ అందుకున్నాడు. ఇప్పటికే ఫైనల్ చేరిన భారత్ సెప్టెంబర్ 17న డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

