Novak Djokovic | ప్రపంచ నంబర్ వన్, సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ (Novak Djokovic)కు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఇటలీలోని రోమ్ (Rome)లో జరుగుతున్న ఇటాలియన్ ఓపెన్‌లో అతడి తలపై వాటర్ బాటిల్ (water bottle) పడింది. మ్యాచ్ అనంతరం ఫ్యాన్స్‌కు ఆటోగ్రాఫ్ ఇస్తున్న సమయంలో అనుకోకుండా వాటర్ బాటిల్ వచ్చి నేరుగా జకోవిచ్ తలకు తగిలింది.
జకోవిచ్ ఇటాలియన్ ఓపెన్‌లో శుక్రవారం ఫ్రాన్స్‌కు చెందిన కొరెంటిన్ మౌటెట్పై రెండో రౌండ్లో విజయం సాధించాడు. అనంతరం కోర్టును వీడుతూ.. ఫ్యాన్స్‌కు ఆటోగ్రాఫ్ ఇస్తున్నాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి బ్యాగ్‌లోంచి అనుకోకుండా వాటర్ బాటిల్ జారి నేరుగా జకోవిచ్ తలపై పడింది. దీంతో అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన అధికారులు అతడికి సాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
The tournament released a video showing that Novak Djokovic was hit on the head by accident.
The bottle slipped from a fan’s backpack.
Just a very unfortunate, unlucky situation. ❤️🩹
(via @InteBNLdItalia)
pic.twitter.com/5LIzzWZpMS— The Tennis Letter (@TheTennisLetter) May 10, 2024
ఈ ఘటనపై టెన్నిస్ స్టార్ ఎక్స్ వేదికగా స్పందించారు. అనుకోకుండా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ప్రస్తుతం తాను బాగున్నానని, హోటల్ గదిలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు చెప్పారు. ఐస్ ప్యాక్‌తో కాస్త రిలీఫ్ ఇచ్చినట్లు తెలిపారు. ఆదివారం జరగబోయే మ్యాచ్‌లో కలుద్దాం అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
Thank you for the messages of concern. This was an accident and I am fine resting at the hotel with an ice pack. See you all on Sunday. #IBI24
— Novak Djokovic (@DjokerNole) May 10, 2024
Also Read..
Maneka Gandhi | వరుణ్ గాంధీ సమర్థుడు.. అతడిపై పూర్తి విశ్వాసం ఉంది : మేనకా గాంధీ
Afghanistan | తాలిబన్ దేశాన్ని ముంచెత్తిన వరదలు.. 60 మంది మృతి
Barron Trump | 18 ఏళ్లకే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న ట్రంప్ చిన్నకుమారుడు