Barron Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో వారసుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన చిన్న కుమారుడు బారన్ ట్రంప్ (Barron Trump) రాజకీయ రంగ ప్రవేశానికి (political debut) సిద్ధమయ్యారు. 18 ఏళ్ల బారన్ ఈ వేసవిలో ‘రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్’ (Republican National Convention)కు ఫ్లోరిడా నుంచి ప్రతినిధిగా రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. ఈ విషయాన్ని పార్టీ చైర్మన్ ఇవన్ పవర్ వెల్లడించారు.
నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ పోటీ చేయనున్న విషయం తెలిసిందే. అయితే, ఆయన ఎంపికను ధ్రువీకరించేందుకు విస్కాన్సిన్లోని మిల్వాకీ నగరంలో జులైలో పార్టీ కన్వెన్షన్ జరగనుంది. దీనికి ఫ్లోరిడా నుంచి 41 మంది ప్రతినిధులు వెళ్లనున్నారు. వారిలో బారన్ ట్రంప్ ఒకరని ఇవన్ పవర్ వెల్లడించారు.
డొనాల్డ్ ట్రంప్ – మెలానియా ట్రంప్ కుమారుడే బారన్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్‌కు బారన్ ఐదో సంతానం. మార్చి 20, 2006లో బారన్ జన్మించాడు. ఈ మార్చిలో ఆయనకు 18 ఏళ్లు వచ్చాయి. వచ్చే వారమే హైస్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ కానున్నారు. మరోవైపు ట్రంప్ ఇతర వారసులైన డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్, చిన్న కుమార్తె టిఫనీ సైతం పార్టీ తరఫున ఫ్లోరిడా ప్రతినిధులుగా వ్యవహరించనున్నారు. ఇక బారన్.. ట్రంప్ కుటుంబంలో అతి చిన్న వయసులో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం.
Also Read..
Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యాలపై ముందే హెచ్చరించిన బీజేపీ నేత అరెస్ట్
Delhi Storm | ఢిల్లీని కుదిపేసిన దుమ్ము తుఫాను.. ఇద్దరు మృతి.. విమాన రాకపోకలకు అంతరాయం