Prajwal Revanna | కర్ణాటకలో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajval Revanna) సెక్స్ స్కాండల్ కేసు (Karnataka Sex Scandal Case) దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో రేవణ్ణ దారుణాల గురించి ముందే హెచ్చరించిన న్యాయవాది, బీజేపీ నేత దేవరాజే గౌడ (Devaraje Gowda)ను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. చిత్రదుర్గ్లోని గులిహాల్టోల్గేట్ వద్ద ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. తనను దేవరాజ్‌గౌడ లైంగిక వేధింపులకు గురిచేశారంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.
కర్ణాటకలో జేడీఎస్‌తో పొత్తుకు ముందే.. ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యాల గురించి బీజేపీ అధిష్ఠానాన్ని దేవరాజే గౌడ ముందే అప్రమత్తం చేసినట్లు ఇటీవలే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజ్వల్ రేవణ్ణకు మద్దతివ్వొద్దంటూ బీజేపీకి గతేడాది ఆయన సూచించారు. ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యాల వీడియోలు అనేకం ఉన్నాయని, అవి బయటకు వస్తే పార్టీకి చేటు కలుగుతుందని హెచ్చరించారు. ఇక దేవరాజే గౌడ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజ్వల్ తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు హెచ్డీ రేవణ్ణపై పోటీ చేసి ఓడిపోయారు. అయితే, హాసన జిల్లాకు చెందిన ఓ మహిళ.. తనను దేవరాజే మోసం చేశాడంటూ ఇటీవలే పోలీసులను ఆశ్రయించింది. ఆస్తి విక్రయించడంలో సాయం చేస్తానని నమ్మించి తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు దేవరాజే గౌడపై లైంగిక వేధింపుల కేసు (Sex Abuse Case) నమోదు చేసిన పోలీసులు తాజాగా ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.
Also Read..
JP Nadda | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జేపీ నడ్డా
Delhi Storm | ఢిల్లీని కుదిపేసిన దుమ్ము తుఫాను.. ఇద్దరు మృతి.. విమాన రాకపోకలకు అంతరాయం