Afghanistan | తాలిబన్ పాలిత దేశమైన ఆఫ్ఘానిస్థాన్ (Afghanistan)ను ఆకస్మిక వరదలు (flash floods) ముంచెత్తాయి. ఉత్తర ఆఫ్ఘానిస్థాన్‌లో తాజాగా కురిసిన వర్షాలకు వరద పోటెత్తింది. దీంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వరదల కారణంగా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది.
ఉత్తర ఆఫ్ఘానిస్థాన్‌లో వరదల కారణంగా ఒక్కరోజులోనే కనీసం 200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాలిబన్ అధికారులు ప్రకటించారు. అనేక ఇళ్లు వరదలు కొట్టుకుపోయాయి. సుమారు 100 మందికిపైగా ప్రజలు గాయపడినట్లు చెప్పారు. బాగ్లాన్ ప్రావిన్స్ (Baghlan province)లోని ఐదు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతైనట్లు పేర్కొన్నారు.
గత నెలలో కురిసిన భారీ వర్షాలకు 100 మంది మరణించిన విషయం తెలిసిందే. ఆ విషాదం నుంచి కోలుకోకముందే మరోసారి వరదలు ఆఫ్ఘాన్‌ను ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రాంతాలను వరద చుట్టుముట్టింది. దీంతో ప్రజలు ఎటూ వెళ్లలేక ఇళ్లలోనే చిక్కుకుపోయిన పరిస్థితి. రంగంలోకి దిగిన అధికారులు వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. భారీ వర్షాలకు రాజధాని కాబూల్‌కు ఉత్తర ఆఫ్ఘానిస్థాన్‌ను కలిపే ప్రధాన రహదారిని సైతం మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వర్షాలకు దాదాపు రెండు వేల ఇళ్లు, మసీదులు, పాఠశాలలు దెబ్బతిన్నట్లు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా.
Also Read..
Maneka Gandhi | వరుణ్ గాంధీ సమర్థుడు.. అతడిపై పూర్తి విశ్వాసం ఉంది : మేనకా గాంధీ
Barron Trump | 18 ఏళ్లకే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న ట్రంప్ చిన్నకుమారుడు
Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యాలపై ముందే హెచ్చరించిన బీజేపీ నేత అరెస్ట్