Noida Test : న్యూజిలాండ్, అఫ్గనిస్థాన్‌ల మధ్య గ్రేటర్ నోయిడా(Greater Noida)లో జరగాల్సిన ఏకైక టెస్టు రద్దు చర్చనీయాంశం అవుతోంది. రెండు రోజులు వాన తెరిపినిచ్చినా ఔట్ ఫీల్డ్(Out Field)ను సిద్దం చేయలేకపోవడం మైదానంలో వసతుల లేమికి అద్దం పట్టింది. ఇందులో బీసీసీఐ (BCCI) వైఫల్యం కూడా భాగమే. దాంతో, శుక్రవారం పిచ్, ఔట్‌ఫీల్డ్‌ను పరిశీలించిన మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ ఇరుజట్ల కెప్టెన్లతో మాట్లాడి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాడు. టెస్టు క్రికెట్లో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దవ్వడం ఈ 26 ఏండ్లలో ఇదే తొలిసారి.
ఇంతకుముందు ప్రపంచ క్రికెట్లో ఏడు పర్యాయాలు మాత్రమే ఒక్క బంతి పడకుండా టెస్టు మ్యాచ్ రద్దయ్యింది. తాజాగా నోయిడాలో న్యూజిలాండ్, అఫ్గనిస్థాన్ ఏకైక టెస్టు రద్దుతో ఆ సంఖ్య ఎనిమిదికి చేరింది. అంతర్జాతీయంగా తొలి టెస్టు ఎప్పుడు రద్దు అయిందంటే..? 1890లో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన మ్యాచ్‌లో ఒక్క బంతి పడలేదు.
For the first time in 26 years, a Test was washed out before a ball was bowled ❌
The full list:
ENG v AUS – Manchester, 1890
ENG v AUS – Manchester, 1938
AUS v ENG – Melbourne, 1970
NZ v PAK – Dunedin, 1989
WI v ENG – Georgetown, 1990
PAK v ZIM – Faisalabad, 1998
NZ v IND -… pic.twitter.com/BHuIV1xaE8— ESPNcricinfo (@ESPNcricinfo) September 13, 2024
అనంతరం 1938లో అదే మైదానంలో ఇంగ్లండ్, ఆసీస్‌ల టెస్టు మ్యాచ్ రద్దయ్యింది. 1970లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య మెల్బోర్న్ వేదికగా జరగాల్సిన టెస్టు వర్షార్పణం అయింది. న్యూజిలాండ్, పాకిస్థాన్‌ల మధ్య 1989లో ఒక టెస్టు, 1990లో వెస్టిండీస్, ఇంగ్లండ్‌ల మ్యాచ్ కూడా ఇలానే రద్దు అయ్యాయి. అనంతరం ఇక 1998లో రెండు పర్యాయాలు ఇలానే జరిగింది. ఫైసలాబాద్‌లో ఆతిథ్య పాకిస్థాన్, జింబాబ్వే మధ్య ఒక టెస్టు మ్యాచ్ సాగలేదు. నెడిన్ మైదానంలో న్యూజిలాండ్, భారత్ టెస్టులో కూడా ఒక్క బంతి పడలేదు.
షెడ్యూల్ ప్రకారం న్యూజిలాండ్‌తో ఏకైక టెస్టు అఫ్గనిస్థాన్‌లో జరగాలి. కానీ, అక్కడ అంతర్జాతీయ స్టేడియం, సరైన వసతుల కొరత కారణంగా అఫ్గన్ క్రికెట్ బోర్డు బీసీసీఐని ఆశ్రయించింది. భారత్‌లో తమ టెస్టు మ్యాచ్ ఆడేందుకు అనుమతించాలని కోరంది. గతంలో అఫ్గనిస్థాన్ జట్టు ఇక్కడే ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడింది. అయితే.. ఈసారి దులీప్ ట్రోఫీ(Duleep Trophy) సమయంలోనే న్యూజిలాండ్‌తో ఏకైక టెస్టు ఆడాల్సి వచ్చింది.
అందుకని బీసీసీఐ నోయిడాలోని మైదానాన్ని కేటాయించింది. కానీ, ఈసారి నోయిడాలో వాన తగ్గాక కూడా ఔట్ ఫీల్డ్‌ను ఆరబెట్టేందుకు సిబ్బంది రెండు రోజులు శ్రమించారు. దాంతోనే అర్ధం చేసుకోవచ్చు అక్కడ వసతులు ఏ మేరకు ఉన్నాయో. ఎన్నో అంతర్జాతీయ టోర్నీలను సమర్ధంగా నిర్వహించిన బీసీసీఐకి నోయిడా మైదానం మాయని మచ్చ తెచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.