Chandra Babu | చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
Chandra Babu | చిత్తూరు జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
అమరావతి: చిత్తూరు జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra Babu) , రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి (Minister Ramprasad Reddy) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జిల్లాలోని మొగిలి ఘాట్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు రెండు లారీలను ఢీకొట్టగా 8 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 30 మందికి గాయాలయ్యాయి.
దుర్ఘటనలో మరణించిన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. రెండు లారీలను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
చిత్తూరు, బెంగళూరు జాతీయ రహదారిపై పలమనేరు నుంచి తిరుపతివైపు వస్తున్న ఆర్టీసీ బస్సు పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న రెండు లారీలను ఢీ కొట్టింది. అనంతరం పక్క రోడు నుంచి వెళ్తుతున్న టెంపోవ్యాన్ను కూడా ఢీకొట్టింది. ఆయా వాహనాల్లో ఉన్న ప్రయాణికుల్లో 8 మంది మృతి చెందగా మరో 30 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను పలమనేరు ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

