NZ vs AFG : గ్రేటర్ నోయిడాలో జరగాల్సిన ఏకైక టెస్టు రద్దుతో న్యూజిలాండ్(Newzealand), అఫ్గనిస్థాన్(Afghanistan) ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేశారు. వర్షాలకు తోడూ బీసీసీఐ(BCCI) వైఫల్యం కారణంగా టెస్టు మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. దాంతో, అంపైర్లు ఎట్టకేలకు శుక్రవారం మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. నాలుగు రోజులైనా సరే ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ ముగియడం పట్ల రెండు జట్ల హెడ్‌కోచ్‌లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టీడ్(Gary Stead), అఫ్గన్ కోచ్ జొనాథన్ ట్రాట్(Jonathan Trott)లు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏం అన్నారంటే..? ‘నోయిడా టెస్టు రద్దు మమ్మల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. అఫ్గనిస్థాన్‌తో మాకు ఇదే తొలి మ్యాచ్. అందుకని మేము ఎంతో ఉత్సాహంగా ఎదురుచూశాం. నిరుడు వరల్డ్ కప్ నుంచి అఫ్గన్ జట్టు అద్భుతంగా ఆడుతోంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో ఉన్న మాకు త్వరలోనే శ్రీలంక సిరీస్ ఉంది. అందుకు సన్నాహకంగా ఈ టెస్టు ఉపయోగపడుతుంది అనుకున్నాం. కానీ, వర్షం కారణంగా మ్యాచ్ రద్దుతో చాలా అసహనానికి లోనయ్యాం అని న్యూజిలాండ్ కోచ్ స్టీడ్ అన్నాడు.
‘We are frustrated’ – NZ’s Gary Stead laments ‘lost opportunity’ with abandoned one-off Test vs Afghanistan#NZvAFG #GreaterNoida
READ: https://t.co/Dfl71qFLq0https://t.co/Dfl71qFLq0
— WION Sports (@WIONSportsNews) September 13, 2024
దాదాపు ఇదే తరహాలో అఫ్గన్ కోచ్ జొనాథన్ ట్రాట్ కూడా స్పందించాడు. ‘ఈరోజు ఉదయం మేము మైదానాన్ని పరిశీలించాం. దురదృష్టవశాత్తూ అది ఆటకు ఏమాత్రం అనువుగా లేదు. ఎలాగైనా సరే ఒక్క రోజైనా టెస్టు మ్యాచ్ జరగాలని అనుకున్నాం. కానీ, ఆటగాళ్ల భద్రతలో రాజీ పడలేం కదా!. కొన్నిసార్లు మనం ఏమీ చేయలేం. పరిస్థితులకు తలొగ్గక తప్పదు’ అని ట్రాట్ వెల్లడించాడు.
For only the eighth time in the history of Test cricket, a match has been abandoned without a ball bowled 😮https://t.co/Rr14xybfh4 #AFGvNZ pic.twitter.com/K9jMzn4Tea
— ESPNcricinfo (@ESPNcricinfo) September 13, 2024
షెడ్యూల్ ప్రకారం అఫ్గనిస్థాన్‌లో ఈ ఏకైక టెస్టు జరగాలి. కానీ, అక్కడ అంతర్జాతీయ స్టేడియం, సరైన వసతుల కొరత కారణంగా అఫ్గన్ క్రికెట్ బోర్డు భారత్‌లో ఆడేందుకు అనుమతించాలని బీసీసీఐని కోరంది. గతంలో అఫ్గనిస్థాన్ జట్టు ఇక్కడే ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడింది. అయితే.. ఈసారి దులీప్ ట్రోఫీ(Duleep Trophy) సమయంలోనే న్యూజిలాండ్‌తో ఏకైక టెస్టు ఆడాల్సి వచ్చింది. అందుకని బీసీసీఐ నోయిడాలోని మైదానాన్ని కేటాయించింది.