విజయవాడ కలెక్టరేట్లో తీవ్ర విషాదం నెలకొంది. డ్యూటీలో ఉన్న ఓ కానిస్టేబుల్ గుండెపోటుతో మరణించాడు.
వివరాల్లోకి వెళ్తే.. చందూనాయక్ అనే కానిస్టేబుల్ విజయవాడ కలెక్టరేట్లో విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా అతను అస్వస్థతకు గురయ్యాడు. ఛాతిలో నొప్పిగా ఉండటంతో కుప్పకూలాడు. దీంతో అప్రమత్తమైన ఇతర సిబ్బంది చందూ నాయక్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ చందూనాయక్ మరణించాడు. గుండెపోటుతో ఆయన మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు.