Ambati Rambabu | భారత్, ఆస్ట్రేలియా మధ్య మెల్బోర్న్లో (Melbourne) జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో (Test Match) తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి (Nitish Reddy) అద్భుతం సృష్టించిన విషయం తెలిసిందే. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు. సీనియర్లంతా నిరాశపర్చినా ఆసీస్ బౌలర్లను ఆడుకున్నాడు. ఒక సిక్స్, 9 ఫోర్లతో సెంచరీతో కదం తొక్కాడు. దీంతో అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే, అతడు అర్ధ శతకం నమోదు చేసిన సమయంలో పుష్ప స్టైల్లో ‘తగ్గేదేలే’ అంటూ మేనరిజంతో సంబురాలు చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అతడి పుష్ప స్టైల్ సెలబ్రేషన్స్‌పై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) స్పందించారు. ‘ప్రపంచాన్నే ప్రభావితం చేస్తున్న పుష్ప.. హీరోని వేధిస్తూ తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తానంటే నమ్మేదెలా అబ్బా.. ?’ అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఈ పోస్ట్‌కు నితీశ్ వీడియోని కూడా షేర్ చేశారు.
ప్రపంచాన్నే ప్రభావితం చేస్తున్న
“పుష్ప”…….. హీరోని వేధిస్తూ
తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి
తీసుకువెళ్తానంటే నమ్మేదెలా అబ్బా ? pic.twitter.com/0b3C7XjpZR— Ambati Rambabu (@AmbatiRambabu) December 28, 2024
కాగా, సంధ్యా థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో టాలీవుడ్ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిన కలిసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా కూడా అంబటి ఓ ఆసక్తికర ట్వీట్ పెట్టారు. ‘పూర్తి పరిష్కారానికి ‘సోఫా’ చేరాల్సిందే..!’ అంటూ ఆయన పెట్టిన పోస్టు సంచలనం రేపింది. ఎందుకంటే.. పుష్ప-2 మూవీలో ‘సోఫా’ సీన్లు ఉంటాయన్న విషయం తెలిసిందే. తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్లను కొనేందుకు, అనుకూలంగా పనిచేసేవాళ్లకు పుష్పరాజ్ ‘సోఫా’ పంపిస్తుంటారు. అందులో పెద్ద మొత్తంలో డబ్బు ఉంచి లంచంగా ఇస్తుంటారు. ఇదే అంశాన్ని అంబటి రాంబాబు ప్రస్తావిస్తూ.. ‘సోఫా’ పంపితేనే సినీ ఇండస్ట్రీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందంటూ వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ‘పుష్ప వివాదానికి.. పుష్పరాజ్ తరహాలోనే పరిష్కారమా..?’ అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. ఇప్పుడు మరోసారి అదే తరహా ట్వీట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
Also Read..
Nitish Reddy | తగ్గేదేలే.. పుష్ప స్టైల్లో నితీశ్ హాఫ్ సెంచరీ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
Nitish Reddy | నితీశ్ రెడ్డి సూపర్ సెంచరీ.. టెస్ట్ కెరీర్లో తొలి శతకం