Nitish Kumar Reddy | బోర్డర్-గవాస్కర్ టోర్నమెంట్లో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ అదరగోడుతున్న విషయం తెలిసిందే. పేస్ ఆల్‌రౌండర్‌గా టీంలోకి వచ్చిన అతడు.. నాలుగో టెస్ట్‌లో టీమిండియాను ఫాల్ ఆన్ గండం నుంచి బయటపడేశాడు. ఈ క్రమంలోనే టెస్ట్ కెరీర్లో తొలి సెంచరీని సాధించాడు.
171 బంతుల్లో ఈ రికార్డును అందుకున్న నితిష్.. ఎనిమిదో స్థానంలో వచ్చి ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక పరుగులు సాధించిన
భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్ కుంబ్లే (87) పేరిటా ఉంది. ఇదిలావుంటే నితిష్ కుమార్ రెడ్డి సెంచరీ సాధించడంతో స్టాండ్స్‌లో ఉన్న అతని తండ్రి ముత్యాలరెడ్డి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు! లేచి నిలబడి చప్పట్లు కొట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
— Nemo (@stevharring1000) December 28, 2024
— Nemo (@stevharring1000) December 28, 2024