అమరావతి : భారత్, ఆస్ట్రేలియా మధ్య మెల్బోర్న్లో (Melbourne) జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో (Test Match) మూడో రోజు సెంచరీ చేసిన విశాఖ (Visaka)కుర్రాడు పై అభినందనలు వ్యక్తమవుతున్నాయి.
భారత్ జట్టు మొదటి ఇన్నింగ్‌లో వికెట్లు పడుతున్న సమయంలో ఓపికగా పిచ్‌పై నిలబడి ఫాస్ట్‌బౌలర్లను సైతం ధాటిగా ఎదుర్కొని సెంచరీ (Century) చేయడం పట్ల ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విటర్ వేదిక ద్వారా అభినందనలు తెలిపారు.
మెల్బోర్న్లో వైజాగ్ అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar reddy) సెంచరీ చేయడం గర్వంగా ఉందని అన్నారు. ఆసీస్‌పై ఒత్తిడిలో అద్భుతమైన ధైర్యం, పట్టుదల, సంకల్ప శక్తిని ప్రదర్శించి తొలి సెంచరీని సాధించినందుకు మిమ్మల్ని చూసి గర్విస్తున్నామని పేర్కొన్నారు.
తన పోరాటాన్ని ఇలానే కొనసాగించాలని సూచించారు. మీరు చేసే ప్రతి పరుగును చూసి ఆనందిస్తామని 2024 సంవత్సరం ముగింపులో తన బ్యాట్‌తో ఆంధ్రప్రదేశ్ గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటినందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
And it’s a 100!
I am overjoyed to see Vizag boy @NKReddy07 demonstrate courage, grit, and sheer will-power to deliver a remarkable maiden hundred under pressure against the Aussies. We are proud of you Nitish. Keep going. We are cheering on to every run.
Thanks for your… pic.twitter.com/KrzPVqjJWd
— Lokesh Nara (@naralokesh) December 28, 2024
కుమారుడి తొలి సెంచరీని చూసి నితీశ్ తండ్రి భావోద్వేగానికి లోనయ్యారు. సంతోషంతో కన్నీరుపెట్టారు. మూడో రోజు ఆట ముగింపు సమయానికి మొత్తంగా 9 వికెట్లు కోల్పోయి 355 రన్స్ చేసింది. ప్రస్తుతం నితీశ్ (104), సిరాజ్ (2) రన్స్‌తో నాటౌట్‌గా ఉన్నారు.
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ మరో 116 రన్స్ వెనుకపడి ఉన్నది. పంత్ (28), జడేజా (17) రన్స్ చేశారు. టీమ్ఇండియా తరఫున నితీశ్ 104 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్, బోలాండ్ 3 వికెట్ల చొప్పున తీయగా, నాథన్ 2 వికెట్లు పడగొట్టాడు.