మెల్బోర్న్: బాక్సింగ్ డే టెస్టులో భారత్ మళ్లీ గాడిలో పడింది. ఫాలో ఆన్ గండం నుంచి బయటపడిన టీమ్ఇండియా.. తొలిఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన స్కోర్ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది. ఈ క్రమంలో టీమ్ఇండియా నయా స్టార్ నితీశ్ రెడ్డి (Nitish Reddy) ఆసీస్‌పై తొలి అర్ధ శతకం నమోదుచేశాడు. దీంతో పుష్ప స్టైల్లో ‘తగ్గేదేలే’ అంటూ మేనరిజంతో సంబురాలు చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది.
మూడో ఆటను ప్రారంభించిన కొద్ది సేపటికే పంత్, జడేజాను ఆసీస్ బౌలర్లు పెవీలియన్‌కు పంపారు. దీంతో భారత్ ఫాల్ ఆన్ గండం నుంచి బయటపడం కష్టమనే అనిపించింది. అయితే నవీన్ రెడ్డి ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ తనదైన షాట్స్‌తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. మరో ఎండ్‌లో అతనికి వాషింగ్టన్ సుందర్ చక్కని సహకారం అందిస్తున్నాడు. దీంతో భారత్ 324 రన్స్ చేసింది. ప్రస్తుతం నితీశ్ (85), సుందర్ (39) రన్స్‌తో క్రీజులో ఉన్నారు. టీమ్ఇండియా 150 రన్స్ చేయాల్సి ఉంది.