మెల్బోర్న్: మెల్బోర్న్లో తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి (Nitish Reddy) అద్భుతం సృష్టించాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు. సీనియర్లంతా నిరాశపర్చినా ఆసీస్ బౌలర్లను ఆడుకున్నాడు. ఒక సిక్స్, 9 ఫోర్లతో సెంచరీతో కదం తొక్కాడు. ఆల్‌రౌండర్లు జడేజా, సుందర్ సహకారంతో జట్టు స్కోరును 350 దాటించాడు. 99 రన్స్ వద్ద ఫోర్ కొట్టి టెస్టుల్లో ఘనంగా తొలి సెంచరీ నమోదుచేశాడు. ఈ సందర్భంగా ప్రేక్షకుల్లో ఉన్న నితీశ్ తండ్రి భావోద్వేగానికి లోనయ్యారు. కుమారుడి శతకం చూసిన ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. ఎనిమిదో స్థానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ నిలిచాడు. ఇంతకుముందు అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించాడు.
ఇక వాషింగ్టన్ సుందర్ 50 పరుగులు చేసిన కాసేపటికే వెనుతిరిగాడు. నితీశ్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 127 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. నాథన్ లియాన్ బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి 8వ వికెట్‌గా ఔటయ్యాడు. అయితే ఆ తర్వాత వచ్చిన బుమ్రా కూడా నిరాశపర్చాడు. ప్రస్తుతం సిరాజ్ (2), నితీశ్ (105) క్రీజులో ఉన్నారు. 9 వికెట్ల నష్టానికి 358 రన్స్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో మరో 116 రన్స్ చేయాల్సి ఉంది.
What a hundred what a innings by this 21 year old…
Nitish Reddy’ s father in tears…#INDvsAUS pic.twitter.com/Ral8PFoXe8— Ranit Sarkar (@iam_ranit) December 28, 2024