Nitish Kumar Reddy : భారత జట్టు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) దేశవాళీలో హ్యాట్రిక్‌తో మెరిశాడు. టీ20 ఫార్మాట్లో జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో ఆంధ్రకు ఆడుతున్న నితీశ్ మధ్యప్రదేశ్‌పై వరుసగా మూడు వికెట్లు తీశాడీ పేసర్. పుణేలోని డీవై పాటిల్ అకాడమీలో శుక్రవారం స్వల్ప ఛేదనకు దిగిన ఎంపీ టాపార్డర్‌ను కుప్పకూల్చాడీ మీడియం పేసర్. బ్యాట్‌తోనూ నితీశ్ (27పరుగులు) మెరిసినా ఆంధ్ర జట్టు ఓటమి తప్పించుకోలేకపోయింది.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సూపర్ లీగ్ గ్రూప్ ఏలోని ఆంధ్ర, మధ్యప్రదేశ్ పుణేలో తలపడ్డాయి. స్వల్ప స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో ఆంధ్రకు ఎంపీ జట్టు షాకిచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆంధ్రను ఎంపీ ఆఫ్ స్పిన్నర్ శివం శుక్లా(4-23), మీడియం పేసర్ త్రిపేశ్ సింగ్(3-31), రాహుల్ బాథమ్(2-9)లు దెబ్బకొట్టారు. నితీశ్ కుమార్ 25బంతుల్లో 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా ఆంధ్ర 112కే పరిమితమైంది. అనంతరం ఛేదనలో మధ్యప్రదేశ్‌ను హ్యాట్రిక్‌తో దెబ్బకొట్టాడు నితీశ్.
A hat-trick for Nitish Kumar Reddy in the Syed Mushtaq Ali Trophy 👏
(via @BCCIdomestic) pic.twitter.com/ubQReJYQXr
— ESPNcricinfo (@ESPNcricinfo) December 12, 2025
మూడో ఓవర్ నాలుగో బంతికి హెచ్ గవిల్(5) బౌల్డ్ చేశాడు. ఐదో బంతికి హర్‌ప్రీత్(0) స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక హ్యాట్రిక్ బంతికి కెప్టెన్ రజత్ పాటిదార్(0) ఆడిన బంతి అనూహ్యంగా వికెట్లను గిరాటేసింది. అంతే… బౌల్డ్ కావడతో 14 పరుగులకే మూడు బిగ్ వికెట్లు కోల్పోయింది ఎంపీ. కాసేపటికే వెంకటేశ్ అయ్యర్(22) సైతం వెనుదిరగగా.. మ్యాచ్ ఆంధ్ర వైపు మళ్లింది. కానీ, బాథమ్ (35)- రిషభ్ చౌహన్(47)లు 73 పరుగుల కీలక భాగస్వామ్యంతో ఎంపీని గెలిపించారు.