IND vs ENG : బర్మింగ్హమ్లో భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసిన ఇంగ్లండ్ బ్యాటర్లు లార్డ్స్‌లోనూ తడబడ్డారు. లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (2-15) విజృంభణతో ఆతిథ్య జట్టు ఆదిలోనే కష్టాల్లో పడింది. ఒకే ఓవర్లో ఓపెనర్లు పెవిలియన్ చేరిన వేళ.. అనుభవజ్ఞుడైన జో రూట్(24 నాటౌట్), ఓలీ పోప్(12 నాటౌట్) అండగా జట్టును ఆదుకున్నాడు. టీమిండియా పేసర్లను కాచుకుంటూ వికెట్ కాపాడుకున్న ఈ జోడీ మూడో వికెట్‌కు రన్స్ రాబట్టింది. లంచ్ సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది.
లార్డ్స్ మైదానంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఊహించని విధంగా నితీశ్ రెడ్డి నుంచి ముప్పు ఎదురైంది. కొత్త బంతితో బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్‌లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వికెట్ కాపాడుకున్న బెన్ డకెట్(23), జాక్ క్రాలే (18)లను నితీశ్ విడదీశాడు.
Caught behind x TWO 😎
Nitish Kumar Reddy gets both the England openers 💪
England 44/2 after 14 overs
Updates ▶️ https://t.co/X4xIDiSmBg#TeamIndia | #ENGvIND | @NKReddy07 pic.twitter.com/Pu5UDegYlU
— BCCI (@BCCI) July 10, 2025
లెగ్ సైడ్ ఆడబోయిన డకెట్ వికెట్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగగా.. చివరి బంతికి క్రాలే సైతం పంత్ చేతికే చిక్కాడు. దాంతో, 44 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత జో రూట్ ఓలీ పోప్లు సమయోచితంగా ఆడుతూ ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు. 11 ఓవర్ల పాటు ఈ ద్వయం వికెట్ కాపాడుకోవడంతో సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్లు కోల్పోయి 83 రన్స్ కొట్టింది.
England 44/2 after 14 overs
Updates ▶️ https://t.co/X4xIDiSmBg#TeamIndia | #ENGvIND | @NKReddy07 pic.twitter.com/Pu5UDegYlU
— BCCI (@BCCI) July 10, 2025